జగన్‌పై వైసీపీ యంగ్‌స్టర్స్ తిరుగుబాటు...?
ఇక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఏదోలా జగన్ ను ఇరుకునపెట్టేలా మాట్లాడుతున్నారు. పైగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ జగన్ చర్యలను తప్పుపడుతున్నారు. అప్పుడే కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయకూడదని ... ప్రభుత్వానికి ఈ ఏడాది డిసెంబర్ వరకు టైం ఇవ్వాలని కేతిరెడ్డి చెబుతున్నారు. ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. మరికొందరు యువ నేఉలత కూడా నేరుగా మీడియా ముందుకు రాకపోయినా జగన్మోహన్రెడ్డి చేసిన రాజకీయంతో తమ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయిందని లబోదిబో అంటున్నారు.
అందుకే చాలావరకు మౌనం పాటిస్తున్నారు. జగన్ ఢిల్లీ ధర్నాకు వెళ్లిన వారిలో ఒకరిద్దరు యువ నేతలు తప్ప ఎక్కువ మంది కనిపించలేదు. రాజకీయ నేపథ్యం ఉండి వారసత్వంతో ఎదగాలనుకుంటున్న నేతలు జగన్ రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చాలావరకు మౌనం పాటిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ రెడ్డిని సమర్థించి తాము సమస్యలలో పడటం కన్నా ... కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని ప్రకటనలు చేసి సేఫ్ గా ఉండాలని యువనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.