జనసేన: ప్రతి ఇంటికి కచ్చితంగా అవి ఇవ్వాల్సిందే.. డిప్యూటీ సీఎం ఆదేశం..!

frame జనసేన: ప్రతి ఇంటికి కచ్చితంగా అవి ఇవ్వాల్సిందే.. డిప్యూటీ సీఎం ఆదేశం..!

Divya
కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కిందన.. ప్రతి గ్రామానికి కూడా.. పంపు, పంపులతో ప్రతి ఇంటికి పంపులు పంపించాలని కాన్సెప్ట్ అనుకున్నది. ఇందులో ఎదురైనటువంటి అతిపెద్ద చిక్కు ఏమిటి అంటే.. పూర్తీ కాకపోవడమే.. అయితే ప్రజలకు మాత్రం ఒకవేళ ఇది వస్తే చాలా హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నీరు అందడం అనేది చాలా ఆనందదాయక విషయమే.. చాలాచోట్ల డెవలప్మెంట్ అయినా కూడా నీరు లేకపోవడం వల్ల మరింత డెవలప్మెంట్ కాకుండా ఉన్నవి కూడా చాలానే ఉన్నాయి.

దీంతో చాలామంది బోర్ వాటర్ మీదే ఆధారపడిన వారు కూడా ఉన్నారు.. ఒకవేళ అది కాకుండా ఉండాలి అంటే.. ఒక ట్యాంకు కట్టించి.. కొళాయిలు వంటివి ఏర్పాటు చేయవలసి ఉంటుంది. గత ప్రభుత్వంలో అవి పట్టించుకోలేదని తెలుస్తోంది.. ఇప్పుడు అలాంటి వాటి పైన సీరియస్ గా దృష్టి సాదిస్తోంది ఏపీ ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రస్థాయి జలజీవనమిషన్.. నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తారో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉండే అధికారులకు కూడా ప్రజలకు నీటి సరఫరా అందించేలా చూడాలని అందుకు తగ్గ ప్రణాళికలను కూడా చేయాలని సూచించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అదంతా లెక్క చూపించమని అడిగారట. నీటి సరఫరా ప్రాంతం నుంచి ఇంటి దగ్గర కొళాయి దాకా ప్రతి దశలో కూడా నిపుణులతో తనిఖీ చేయించాలని నాణ్యంగా ఉన్నాయో లేవో చూడాలని ఆదేశించారు. 4000 కోట్ల రూపాయలు ఖర్చు సరైన వాటికి ఉపయోగించారా లేదా అనే విషయం పైన.. అధికారులను కూడా డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.. జల జీవన నిధులను నీటి ట్యాంకులు, కులాయి పైపులకు ఉపయోగించారా.. ఇంకా ఎన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయో అన్ని విషయాలను కూడా తెలియజేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ప్రతి ఒక్క ఇంటికి కచ్చితంగా కొళాయి వచ్చేలా చూడాలని ఆదేశాలని జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: