టెక్కలి లో వైసీపీ లీడర్ ఖాళీ.. 'దువ్వాడ' నాటకంలో కార్యకర్తలు బలి.!

frame టెక్కలి లో వైసీపీ లీడర్ ఖాళీ.. 'దువ్వాడ' నాటకంలో కార్యకర్తలు బలి.!

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తర్వాత  చాలావరకు వైసీపీ క్యాడర్ లో అనిచ్చితి  నెలకొని ఉంది. కనీసం కార్యకర్తలను వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు.  ఇక లోకల్ గా ఉండే సీనియర్ లీడర్లు అసలు లోకల్ లో ఉండకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలాంటి నియోజకవర్గాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టెక్కలి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్  గత ప్రభుత్వంలో తన మానియా చూపించారు. కానీ ఆయన 2019, 2023 ఎలక్షన్స్ లో అక్కడ వైసిపిని మాత్రం గెలిపించుకోలేకపోయారు. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ వైసిపి అధికారంలో ఉన్నన్ని రోజులు మామూలుగా బీరాలు పోలేదు. కార్యకర్తలు అందరిని వాడుకొని చివరికి వదిలేసి ఎక్కడా, కానీ వాళ్ళని చేశారు.

 ప్రస్తుతం అక్కడ అచ్చేన్నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో దువ్వాడ శ్రీనివాస్ చాలా మైనస్ అయిపోయాడు. ఎన్నికలకు ముందు మనదే విజయం అంటూ ఎంతోమంది కార్యకర్తలను ఉసిగొలిపి అచ్చేన్నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు.  కానీ చివరికి అచ్చేన్నాయుడు అక్కడ విజయం సాధించడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఈ తరుణంలో వారికి సపోర్టుగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం కనీసం నియోజకవర్గంలో కనిపించడం లేదట. 
ఎన్నికలకు ముందు కార్యకర్తలందరికీ 24 గంటలు, 365 రోజులు, ఏ టైములోనైనా సపోర్టుగా ఉంటానని బీరాలు పలికిన  శ్రీనివాస్ ప్రస్తుతం  ఏ కోణాన కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదట.

దీంతో చాలామంది వైసిపి క్యాడర్ ఈ పార్టీలో ఉంటే బాగుండదని, కనీసం ఆదుకునే ఆదుకునే లీడర్లు కూడా లేకపోవడంతో  శ్రీనివాస్ పై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇక వైసీపీలో ఉంటే బ్రతుకు ఉండదని చెప్పి ఓవైపు జనసేన మరోవైపు టిడిపి పార్టీలోకి వెళ్లేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారట.  తరుణంలో  అచ్చేన్నాయుడు కూడా పూర్తిగా అక్కడ వైసీపీ లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని కార్యకర్తలు అందరిని చేర్చుకోవడానికి ప్లాన్ వేసారని తెలుస్తోంది. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టకపోతే మాత్రం టెక్కలిలో వైసిపి పూర్తిగా ఖాళీ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: