రివెంజ్ పాలిటిక్స్ : దీనికి అంతం లేదా.. ఒకరి తర్వాత ఒకరు ఫాలో కావాల్సిందేనా..?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. వైసిపి పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. దానితో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిన్న పాటి చెదురు మొదురు సంఘర్షణలు జరిగాయి. ఇక 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇక తెలుగు దేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక వైసిపి పార్టీ నేతలు , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారు , మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు అని తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన అనేక మంది నేతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వైసిపి పార్టీకి సంబంధించిన వారు మాపై దాడులకు దిగుతున్నారు అని కూడా తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులు , కార్యకర్తలు అనేక సందర్భాలలో చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ఇకపోతే 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక వైసిపి పార్టీకి ఈ సారి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇకపోతే తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చి చాలా తక్కువ రోజులే అవుతుంది.
కాకపోతే వైసిపి పార్టీ నేతలు , కార్యకర్తలు మాత్రం తెలుగు దేశం పార్టీ సభ్యులు మాపై దాడులు చేస్తున్నారు. మా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు అనే ఆరోపాలను గట్టిగా వినిపిస్తున్నారు. ఇకపోతే ఇలా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సభ్యులు ఇతర పార్టీ నేతలపై , కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు అనే వాదనలు బలంగా వినబడుతున్నాయి.
ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యక్తులపై దాడులు చేయడం అనేది ఇలాగే కంటిన్యూ అవుతూ ఒకరి తర్వాత ఒకరు దీన్నే ఫాలో అవుతారా అని కూడా జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి ఇది ఎంత దూరం వెళుతుందో చూడాలి.