అప్పులు చేసి మరీ విదేశాలకు తరలి వెళ్తున్న ఇండియన్ స్టూడెంట్స్..??

frame అప్పులు చేసి మరీ విదేశాలకు తరలి వెళ్తున్న ఇండియన్ స్టూడెంట్స్..??

Suma Kallamadi
ఈ రోజుల్లో అండర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య చాలా పెరుగుతోంది. నిజానికి భారతదేశంలో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్ లాంటి ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి కూడా ఇండియాలో గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌ ఉన్నాయి. భారతదేశం ఏం కోరుకుంటుందంటే నేటి యువత అందరూ కూడా ఇండియాలోనే మంచి కాలేజీల్లో చదువుకోవాలని. కానీ మన వాళ్లు మాత్రం అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లి చదువులు సాగిస్తున్నారు.
కొంతమంది అయితే మంచి ఫారిన్ యూనివర్సిటీలో అడ్మిషన్ రాకపోయినా విదేశాలకు చెక్కేస్తున్నారు. కొత్త వింత, పాత రోత అన్న చందాన నేటి విద్యార్థులన  మనస్తత్వం తయారయ్యింది. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే ఫారిన్ కంట్రీలో పనిచేస్తే డాలర్ల రూపంలో మనీ వస్తుంది. బార్లు, రెస్టారెంట్స్, యూనివర్సిటీ క్యాంటీన్లు, పబ్బుల వంటి వాటిలో పనిచేస్తే బాగానే డబ్బులు వస్తాయి. వాటితో ఫీజులు కట్టేసి అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎలాంటి పనిచేసిన ఎవరూ చూడడం లేదు కదా అని ఆత్మవిశ్వాసాన్ని పక్కనపెట్టి పనులు చేసుకుంటున్నారు.
విదేశాల్లో చదువుకోవడమే పెద్ద గొప్ప, ప్రెస్టేజ్ అని భావిస్తున్నారు. ఫారిన్ యూనివర్సిటీలో స్టడీ కంప్లీట్ చేస్తే ఫారిన్ కంట్రీలోనే జాబ్ వస్తుందని నమ్ముతున్నారు. అందుకే విదేశాలకు తరలిపోతున్న విద్యార్థుల సంఖ్య అనేది భారీ ఎత్తున పెరిగిపోయింది. నిజానికి ఇక్కడ లక్ష మంది చదువుకుంటే 5000 మందికి మాత్రమే జాబ్స్ వస్తాయి. మిగతావారు ఏదో ఒక చిన్న జాబులకు సెటిల్ కావాల్సిందే. అయితే ఆ 5000 మందిలో తాము కచ్చితంగా ఉంటామని చాలామంది అనుకుంటున్నారు. ఆ రేంజ్ లో విదేశీ చదువులపై మోజు పెరిగిపోయింది.
మరోవైపు మన దేశంలో చదువుకోడానికి ఆఫ్ఘనిస్తాన్‌, దుబాయ్, అమెరికా, నేపాల్ దేశాల నుంచి కూడా వస్తున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య మన దేశంలో వేలల్లోనే ఉంటుంది. మన భారతదేశంలో మాత్రం జర్మనీ, ఐర్లాండ్ వంటి దేశాలకు తరలిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: