వైఎస్‌ఆర్‌ చనిపోతే..పార్టీ చేసుకున్న వల్లభనేని వంశీ ?

frame వైఎస్‌ఆర్‌ చనిపోతే..పార్టీ చేసుకున్న వల్లభనేని వంశీ ?

Veldandi Saikiran
గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గట్టి గానే తగులుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఇవాళ విజయవాడలో మీడియాతో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ...వల్లభనేని వంశీ గన్నవరం ఖాన్ దాదా అని... అధికారం అడ్డం పెట్టుకొని వంశీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడని ఆగ్రహించారు.  అధికారం లో ఉన్న ప్పుడు చంద్రబాబు, లోకేష్ బాబు, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడాడని నిప్పులు చెరిగారు.  
వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే...గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ చేసుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడని మండిపడ్డారు. వంశీ లాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి అనర్హుడు అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.  వంశీ సమాజంలో ఎక్కడైనా కనపడితే ప్రజలు పోలీసులకు అప్పచెప్పండని కోరడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టి పారిపోయాడని.... వంశీ... చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడంటూ ఆగ్రహించారు. పరిటాల రవి అనుచరుడినని చెప్పిన వంశీ... పరిటాల రవి ఆస్తులు దోచుకున్నా డని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.  ఐపీఎస్ అధికారి పీఎస్సార్  ఆంజనేయులను హనీ ట్రాప్ తో  ఇరికించాడని ఫైర్‌ అయ్యారు.
పరిటాల రవి దగ్గర వంశీ ఒక చెంచా అంటూ మండిపడ్డారు. ఉరి శిక్ష వేసిన వ్యక్తి కూడా క్షమాభిక్ష ఉంటుంది కానీ వంశీకి క్షమాభిక్ష ఉండదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.  ఎన్నికల ముందు సింహం సింగిల్ గా వస్తుందని రజనీకాంత్ డైలాగులు చెప్పాడన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చేసరికి గజినీకాంత్ మాటలు చెబుతూన్నాడని చురకలు అంటించారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: