కృష్ణా వైసీపీలో గందరగోళం.. కన్‌ఫ్యూజన్..?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ఎన్నికలకు ముందు జగన్ చేసిన కొన్ని ప్రయోగాలు వికటించాయి. పార్టీలో అంతా గందరగోళం చోటుచేసుకుంది. అప్పటివరకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసన్ జగన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. శ్రీనివాస్ అక్కడ ఓడిపోయారు ఇక పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ ను పెనమలూరుకు తీసుకు వస్తే రమేష్ అక్కడ ఓడిపోయారు. ఇక మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టును పోటీ చేస్తే కిట్టు అక్కడ ఓడిపోయారు.. ఇక చివరి వరకు మచిలీపట్నం - అవనిగడ్డ ఈ రెండు చోట్ల ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో పెద్ద కన్ఫ్యూజ్ చోటుచేసుకుంది.
మచిలీపట్నం ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు ? అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు అన్నదానిపై పెద్ద గందరగోళం నెలకొంది. ఇక తిరువూరులో ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే స్వామి దాసుకు సీటు ఇచ్చారు. విజయవాడ ఎంపీగా ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎంపీ కేశినేని నానికి టికెట్ ఇచ్చారు. ఈ ప్రయోగాలు అన్ని పూర్తిగా వికటించాయి .. . అందరూ ఓడిపోయారు. దీంతో ఇప్పుడు జగన్ మళ్ళీ మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు.
కొద్ది రోజుల క్రితమే జోగి రమేష్ ను పెనమలూరు నుంచి మైలవరం కు మార్చారు. పెనమలూరుకు దేవ భక్తుని చక్రవర్తిని ఇన్చార్జిగా నియమించారు. ఇక ఇప్పుడు విజయవాడ పశ్చిమం - విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలతో పాటు విజయవాడ పార్లమెంటు స్థానాలకు కూడా వైసీపీ అధినేత జగన్ పార్టీ తరఫున ఇన్చార్జిలను నియమించాల్సి ఉంది. ఏది ఏమైనా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గంలో ఉన్న కన్ఫ్యూజ్ గందరగోళాన్ని జగన్ త్వరగా సెట్ చేస్తారని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.