పొలిటికల్ జెయింట్ కిల్లర్స్ : ఈటెల కంచుకోటను బద్దలు కొట్టిన పాడి కౌశిక్..?
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన రాజకీయ నాయకులలో ఈటల రాజేందర్ ఒకరు. ఈయన కెసిఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చాలా సంవత్సరాల పాటు కొనసాగారు. అలాగే ఆ పార్టీలో అనేక మంత్రి పదవి బాధ్యతలను కూడా ఈయన నిర్వహించారు. ఇకపోతే హుజూరాబాద్ నుండి అనేక సార్లు పోటీ చేసిన ఈయన అక్కడి నుండి వరుసగా విజయాలను అందుకుంటూ వచ్చాడు.
దానితో ఈయనకు అది కంచుకోటలా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చాక ఇటెలా ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరి హుజురాబాద్ నుండి బై ఎలక్షన్లలో పాల్గొని కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆయనకు కంచుకోట అయినప్పటికీ కొంత కాలం క్రితం జరిగిన ఎన్నికలలో మాత్రం హుజురాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ కంచుకోటలను పడి కౌశిక్ రెడ్డి బద్దలు కొట్టాడు.
ఈయన 2018 వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం 2021 వ సంవత్సరం మంత్రి వర్గం సిఫారసు చేసింది. కౌశిక్ రెడ్డి తెలంగాణ శాసన మండలి కి 2021 లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2021 నవంబరు 16 న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై నవంబరు 22 న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో 2023 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హుజురాబాద్ నుండి బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బరిలో నిలవగా ... బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ బరిలో నిలిచాడు. ఇకపోతే ఈటెల రాజేందర్ కంచుకోట కావడంతో ఇక్కడ ఈయన అవలీలగా గెలుస్తాడు అని చాలా మంది భావించారు.
దానితో కౌశిక్ కూడా ఈటెల కంటే ఎక్కువ ప్రచారాలను ఈ ప్రాంతంలో చేశాడు. అలాగే ఈ సారి నేను గెలవకపోతే నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాను అని కూడా కౌశిక్ స్టేట్మెంట్లను ఈయన ఇచ్చాడు. ఇక రిజల్ట్ రోజు ఎవరు ఊహించిన విధంగా ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ లో ఓడించి పాడి కౌశిక్ గెలిచాడు. ఇలా ఈటెల రాజేందర్ కంచుకోట అయినటువంటి హుజురాబాద్ లో పాడి కౌశిక్ గెలుపొందాడు.