వైసీపీ నుంచి ఒకేసారి జగన్‌కు 9 షాక్‌లు... వామ్మో ఇదేం దెబ్బరా బాబు..?
అయితే రాజ్యసభకు వచ్చే సరికి తెలుగుదేశం బలం జీరో. అసలు పార్టీ పుట్టాక తెలుగుదేశంకు ఎప్పుడూ ఇలాంటి దుస్థితి లేదు. మరో రెండేళ్ల వరకు ఆగాలంటే కష్టమే. అందుకే ఇప్పుడు తెలుగుదేశం కొత్త గేమ్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ లో వైసీపీ కి ఏకంగా 11 మంది ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీ ఎంపీలపై బీజేపీ ఆధార పడడం తెలుగుదేశం పెద్దలకు ఎంత మాత్రం నచ్చలేదట. అందుకే వారు ఫిరాయింపులు ప్రోత్సహించేందుకు సిద్ధమవుతున్నట్టు గా తెలుస్తోంది.
ఇంకా ఈ 11 మంది ఎంపీల్లో చాలా మందికి అయిదేళ్ళ పదవీ కాలం ఉంది. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేయడం కష్టమే.. ఇదిలా ఉంటే ఎవరి బిజినెస్ లు వారికి ఉన్నాయి. అందుకే కొందరు వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించి.. తిరిగి వారికే సీట్లు ఇప్పించి తెలుగుదేశం తరపున వారిని ఎంపీలుగా గెలిపించుకోవడమో లేదా.. 11 మంది ఎంపీలలో ఏకంగా 9 మందిని చేర్చుకోవడం ద్వారా వైఎస్సార్ సీపీ రాజ్యసభ పక్షాన్ని మొత్తం విలీనం చేసుకోవడమో చేయాలన్నదే టీడీపీ పెద్దల ప్లాన్‌గా తెలుస్తోంది. అదే జరిగితే ఇది జగన్ కు మామూలు దెబ్బ కాదనే చెప్పాలి.