రాజ‌కీయాల‌కు వైసీపీ టాప్ లీడ‌ర్‌ దండం... జ‌గ‌న్ నీకో న‌మ‌స్కారం సామీ..?

frame రాజ‌కీయాల‌కు వైసీపీ టాప్ లీడ‌ర్‌ దండం... జ‌గ‌న్ నీకో న‌మ‌స్కారం సామీ..?

RAMAKRISHNA S.S.
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ నేత శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా ? ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు తాను కూడా శ్రీకాకుళం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ఆయన ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. విచిత్రం ఏంటంటే ఈసారి ధర్మాన ప్రసాదరావు పై ఓ సాధారణ సర్పంచ్ అయినా గొండు శంకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఈ ఏకంగా 52,000 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. అసలు శంకర్ కు తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చినప్పుడు వాడు ఎవడు ఒక గుంటడు ... ఒక సర్పంచ్ అనేవాడు ధర్మాన మీద పోటీ చేయటం ఏంటి ? అసలు అతను నాకు పోటీ కాదు అంటూ ధర్మాన గొప్పలకు పోయారు. తీరా చూస్తే ఎన్నికల్లో ధర్మాన ఏకంగా 52 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు.

ఈ దారుణమైన పరాజయాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల‌లో రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిది అన్న నిర్ణయానికి ధర్మాన వచ్చినట్టు శ్రీకాకుళం జిల్లా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ధర్మాన మొన్న ఎన్నికల్లోనే పోటీ నుంచి తప్పుకోవాలని అనుకున్నారు. అందుకే తన తనయుడికి సీటు ఇవ్వాలని జగన్ ను వేడుకున్నారు. అయితే జగన్ మాత్రం ఈసారి కి నువ్వే పోటీ చెయ్ అన్న ... వచ్చేసారికి నీ వారసుడు సంగతి చూద్దాం అని చెప్పడంతో ధర్మాన అయష్టంగానే పోటీ చేశారు. సర్పంచ్ అయినా శంకర్ కు సీటు ఇవ్వడంతో తాను సింపుల్గా గెలుస్తానని ధర్మాన భావించారు.

అయితే ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ ధర్మానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఓ సర్పంచ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ధర్మాన అస్సలు తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇక జ‌గ‌న్ తీరుతో కూడా ధ‌ర్మాన విసిగిపోయి త‌ప్పుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ఇప్పటికే ధర్మాన తన సన్నిహితులు పార్టీ నేతలతో అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని ... తాను పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకుని తన వారసుడికి శ్రీకాకుళం నియోజకవర్గ వైసిపి పగ్గాలు అప్పగించాలని జగన్ను కోరనున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ధర్మాన ప్రసాదరావు అధికారిక‌ ప్రకటన చేస్తే ఏపీ రాజకీయాలలో కీలక నేత రాజకీయానికి తెరపడినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: