నిరుద్యోగుల నెత్తిన పాలు పోసిన రేవంత్ రెడ్డి.. ఎస్సీ వర్గీకరణ అమలుపై సంచలన నిర్ణయం!

Reddy P Rajasekhar
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్ఛిన రోజు నుంచి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా పాలన సాగించిన సంగతి తెలిసిందే. రైతు రుణమాఫీ అమలులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ హామీని చెప్పిన విధంగా అమలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకుంటూ ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు.
 
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వర్గీకరణను సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురి బెంచ్ సమర్థించింది. వర్గీకరణ విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. అయితే జస్టిస్ బాలా త్రివేది మాత్రం వర్గీకరణను వ్యతిరేకించడం కొసమెరుపు. సుప్రీం తీర్పు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని కామెంట్లు చేశారు.
 
వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసన సభలో వాయిదా తీర్మానం ఇచ్చామని ఆయన అన్నారు. అప్పుడు నాతో పాటు సంపత్ కుమార్ ను సభ నుంచి బహిష్కరించారని రేవంత్ పేర్కొన్నారు. గత సర్కార్ ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిందని అలా తీసుకెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేశారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
 
దేశంలో అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ సర్కార్ తీసుకుంటుందని రేవంత్ రెడ్ది తెలిపారు. దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి కామెంట్లు చేశారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో సైతం వర్గీకరణను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్ చెప్పిన విషయాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: