తండికి తగ్గ వారసులు బాలయ్య, హరికృష్ణ.. రాజకీయాల్లో తమ మార్క్ చూపించారుగా!

Reddy P Rajasekhar
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీకావు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన సీనియర్ ఎన్టీఆర్ తన మార్క్ పథకాలతో ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ అప్పట్లో ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయంటే ఆయన ఎంత దూరదృష్టితో ఆలోచించి పథకాలను అమలు చేశారో సులువుగానే అర్థమవుతుంది.
 
అయితే బాలయ్య, హరికృష్ణ సీనియర్ ఎన్టీఆర్ కు సినీ వారసులుగా మాత్రమే కాకుండా రాజకీయ వారసులుగా ప్రూవ్ చేసుకున్నారు. హరికృష్ణ రవాణా శాఖా మంత్రిగా, శాసన సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. హరికృష్ణ మరణించే వరకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. 2018 సంవత్సరం ఆగష్టు నెల 29వ తేదీన ఒక ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు.
 
నందమూరి బాలకృష్ణ 2014 నుంచి హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ విజయం సాధిస్తున్నారు. 2019, 2024 ఎన్నికల్లో సైతం విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన బాలయ్య మంత్రి పదవిపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. బాలయ్య సినిమాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకుంటూనే హిందూపురం ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
 
బాలయ్య సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు అయిందనే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెల 1వ తేదీన బాలయ్య ఘన సన్మానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలకు ఇందుకు సంబంధించి ఆహ్వానం అందిందని సమాచారం అందుతోంది. బాలయ్య సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో బాలయ్య కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. బాలయ్య సినిమాల బడ్జెట్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉన్న సంగతి తెలిసిందే. 35 కోట్ల రూపాయలకు అటూఇటుగా స్టార్ హీరో బాలకృష్ణ పారితోషికం అందుకుంటున్నారు. బాలయ్య కెరీర్ ను భారీ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: