ఆ ఎన్నికలు వైసీపీ స్థాయిని తేల్చబోతున్నాయా.. వైసీపీ లెక్క మారబోతుందా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వైసీపీకి షాకివ్వగా టీడీపీకి అనుకూల ఫలితాలను ఇచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే ఆగష్టు నెల 7వ తేదీన విశాఖలో స్థాయి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ ఎన్నికల్లో మొత్తం పది మంది స్థాయి సంఘం ఛైర్మన్లను ఎన్నికోనున్నారు. వాస్తవానికి విశాఖలో వైసీపీకే ఇప్పటికీ ఎడ్జ్ ఉంది.
 
అయితే ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది కార్పొరేటర్లు పార్టీ మారడం జరిగింది. ఎన్నికల సమయానికి పార్టీ మారే వారి సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే వైసీపీ నేతలు సైతం స్థాయి సంఘం ఎన్నికల్లో సత్తా చాటి కూటమికి గట్టి షాకిస్తామని చెబుతున్నారు. అటు వైసీపీ ఇటు కూటమి ఈ ఎన్నికలను ప్రెస్టీజ్ గా తీసుకోవడం జరిగింది.
 
గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ ఎంత ప్రయత్నించినా సత్తా చాటలేక చేతులెత్తేసింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉండటంతో కూటమికి అనుకూల ఫలితాలు వస్తాయేమో అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నుంచి చాలామంది కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది. స్థాయీ సంఘం ఎన్నికల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
 
అన్ని పార్టీల నుంచి ఇప్పటికే 20 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. స్థాయీ సంఘం ఎన్నికల్లో సత్తా చాటకపోతే మాత్రం జీవీఎంసీలో మేయర్ పీఠం అనధికారికంగా చేజారే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థాయీ సంఘం ఎన్నికలను అటు కూటమి ఇటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సైతం ఈ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఏపీలో జరగబోయే ప్రతి ఎన్నిక గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ ఎక్కువగా జరుగుతోంది.


 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: