ఇండస్ట్రీకి ల్యాండ్ అడిగితే అవమానించిన వైఎస్సార్.. మురళీ మోహన్ తో అలా అన్నారా?

Reddy P Rajasekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన 90 శాతం మంది టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఉన్నస్థాయిలో సినీ సెలబ్రిటీల మద్దతు ఇతర పార్టీలకు లేదనే చెప్పాలి. అయితే వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్న సమయంలో మురళీ మోహన్ ను వైఎస్సార్ అవమానించడం జరిగింది. ఒక సందర్భంలో మురళీ మోహన్ ఈ ఘటనకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు.
 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ల్యాండ్ ఇవ్వాలని టాలీవుడ్ హీరోలతో పాటు మురళీ మోహన్ సైతం వైఎస్సార్ ను ప్రత్యక్షంగా కలిసి కోరారు. వైఎస్సార్ గారిని ల్యాండ్ అడగడానికి వెళ్లిన సమయంలో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కీలక బాధ్యతల్లో ఉన్నానని మురళీ మోహన్ వెల్లడించారు. ఆ సమయంలో మా ఇల్లే ఆఫీస్ గా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను సక్సెస్ చేశామని మురళీ మోహన్ తెలిపారు.
 
సినిమా అవసరాల కోసం హైదరాబాద్ లో 25 ఎకరాల ల్యాండ్ ఉందని అందులో ఒక ఎకరా స్థలం కావాలని మేము వైఎస్సార్ ను కోరగా మురళీ మోహన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడని ఇక్కడున్న మీరందరికీ కూడా సైట్లు ఇవ్వాలంటే ఆయన ఇవ్వగలడని వైఎస్సార్ అన్నారని మురళీ మోహన్ పేర్కొన్నారు. వైఎస్సార్ నన్ను పొగిడారో హేళన చేశారో అర్థం కాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
 
వైఎస్సార్ చేసిన కామెంట్లు విని మా వాళ్లు మాత్రం చాలా ఫీలయ్యారని మురళీ మోహన్ తెలిపారు. మా హీరోలందరూ వచ్చారని ఒక ఫోటో దిగుదామని వైఎస్సార్ ను కోరినా ఆయన అంగీకరించలేదని మురళీ మోహన్ తెలిపారు. వైఎస్సార్ కు టైమ్ ఉండకపోవచ్చని కానీ ఫోటో దిగడానికి ఎంత సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. నేను ప్రతిపక్ష పార్టీ కాబట్టే పని జరగదని అనుకున్నానని మురళీ మోహన్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr

సంబంధిత వార్తలు: