ఉద్యమాల వీరుడు పొన్నం ప్రభాకరుడు..!
- కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ నేతగా అద్భుత గుర్తింపు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ ఒక కీలకమైన మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ నేతగా ఎంతో గుర్తింపు పొందుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాజకీయ ప్రస్థానం:
1967 మే 8న జన్మించిన పొన్నం ప్రభాకర్ చదువుకునే సమయం నుంచే రాజకీయాలపై అవగాహన పెంచుకున్నాడు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలోని ఎన్ఎస్ యూఐలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు. ఆయన సేవలను గుర్తించినటువంటి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఆయనకు కరీంనగర్ పార్లమెంటు సీటు కేటాయించడంతో 2009 వరకు ఎంపీగా చేశారు. అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యుడుగా గెలిచిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఆ విధంగా పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేలా చేసి అదే సమయంలో లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి కూడా గురయ్యారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కరీంనగర్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.