జగన్ ఆనవాళ్లు ఎక్కడ? లోకేష్ మాస్టర్ ప్లాన్ మామ్మూలుగా లేదుగా?

Suma Kallamadi
ఏపీ విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ రాష్ట్రంలోనే కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఐటీ వ్యవస్థ పూర్తిగా ఆయన చేతిలోనే ఉన్న సంగతి విదితమే. అవును, లోకేష్ విద్యా శాఖలో తనదైన ముద్ర వేసుకోవాలని కృషి చేస్తున్నట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆయన గత వైసీపీ ప్రభుత్వం తాలూక గురుతులు అనేవి లేకుండా నిర్వీర్యం చేసే పనిలో పడ్డట్టు గుసగుసలు వినబడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా అనేక పధకాలకు 'జగనన్న' అని పేరు తగిలించడంతో పాటుగా ఏకంగా ఆయన ఫోటోని వాటికి తగిలించిన సంగతి తెలిసినదే. జగన్ పేరు మారుమోగాలనే తపనతోనే వారు ఇలా చేసారు అనేది ఎవరికైనా అర్ధం అవుతుంది.

అయితే ఇది ఒకదశ వరకు అయితే పర్వాలేదు కేజీ, గీత దాటిపోయి రోత పుట్టేలా చేసిన విమర్శలు అపుడు వచ్చాయి. ఈ నేపధ్యంలో కొత్త ప్రభుత్వం టీడీపీ కూటమి జగన్ పేర్లను, ఫోటోలను తొలగించి వాటి ప్లేసులో ఆంధ్ర ప్రదేశ్ రాజ ముద్రని వేయడం విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ, వైసీపీ లాగా అలోచించి ఉంటే అది కూడా స్వార్ధం కిందే వస్తుంది. కానీ లోకేష్ అలా చేయలేదు.. వారి పేర్లను, ఫోటోలను కూడా పక్కనబెట్టి ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం లోగోని ఎంచుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు.. ఆయన తన శాఖలో అరడజను పైగా ఉన్న పథకాలు జగన్ పేర్లని తొలగిస్తూ లోకేష్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అవును, జగనన్న అమ్మ ఒడి పధకం పేరుని తల్లికి వందనం అని, జగనన్న విద్యా కానుక పధకానికి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విద్యార్ధి మిత్ర అని, జగనన్న గోరుముద్ద పధకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని, మన బడి నాడు మనబడి నేడు అన్న పధకానికి మన భవిష్యత్తుగానూ, స్వేచ్చ అన్న దానికి బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు అన్న పధకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చినట్లుగా లోకేష్ తాజాగా ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే ఎక్కడా జగన్ అన్న ఆనవాళ్ళు లేకుండా ఆయన పేరు కనబడకుండా పధకాల విషయంలో కూడా లోకేష్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయినట్టు కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: