బడ్జెట్ 24: వర్కర్లకు, వినియోగదారులకు ప్రత్యేకం ఈ బడ్జెట్!
అదేవిధంగా 3 క్యాన్సర్ మందులను కస్టమ్ డ్యూటీ ఫ్రీగా మార్చడం జరిగింది. దీనిద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది. వీటిపై జీఎస్టీ తొలగించడంతో ఈ మందులు తక్కువ ధరకే లభిస్తాయి. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటిని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించగా దేశవ్యాప్తంగా త్వరలో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. అదేవిధంగా పలు రకాల మెడిసిన్, వైద్య పరికారాలకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ బడ్జెట్‌లో కేంద్రం మహిళలకు, బాలికలకు పెద్దపీట వేసింది. వీరికి లబ్ధి చేకూరేలా ప్రతి ఏటా ఏకంగా రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
వర్కింగ్ మహిళల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం సొంతంగా హాస్టళ్లను ఏర్పాటు చేయనుందని మంత్రి తెలిపారు. ఉపాధి, నైపుణ్యం, MSMEలు (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్)తో పాటు మధ్యతరగతి వంటి నాలుగు ప్రధాన రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. దేశంలోని దాదాపు 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చేలా రానున్న రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల నిధులను కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు. అలాగే జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే దాదాపు 30 లక్షల మంది యువతకు ఒక నెల ప్రావిడెంట్ ఫండ్ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గనుంది. అంతేకాకుండా 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీతో పాటు, సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గించనున్నారు.