జగన్ ను నమ్మి మద్ధతిచ్చే ఒక్క పార్టీ అయినా ఉందా.. ఆ భయమే ఈ స్థితికి కారణమా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒంటరేననే సంగతి తెలిసిందే. ఏపీలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ బీజేపీకి ప్రతి విషయంలో మద్దతుగా నిలిచారు. అందువల్ల బీజేపీని వ్యతిరేకించే పార్టీలేవీ జగన్ ను నమ్మలేదు. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో బీజేపీ నేతలు సైతం జగన్ పై ఒకింత ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది.
 
అయితే గతంలో మరే పార్టీని జగన్ పట్టించుకోని నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఏపీలో అరాచక పాలన గురించి తెలియజేస్తూ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు. అయితే వైసీపీతో కలిసి ఏ రాజకీయ పార్టీ నడిచే అవకాశాలు అయితే లేవని సమాచారం అందుతోంది. కనీసం జగన్ ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకుని ఇతర రాజకీయ పార్టీలను ధర్నాకు ఆహ్వానించాలని అనుకోవడం శుభ పరిణామమని చెప్పవచ్చు.
 
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ లోక్ సభలో కొంతకాలం క్రితం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీకి సపోర్ట్ చేయాలని కాకపోయినా చంద్రబాబును వ్యతిరేకించే పార్టీలు మాత్రం వైసీపీకి మద్దతు తెలిపే అవకాశాలు అయితే ఉన్నాయని ఇందులో ఎలాంటి సందేహాలు అయితే అవసరం లేదని చెప్పవచ్చు. బీజేపీకి ఇప్పటికీ మద్దతు ఇవ్వడం వైసీపీకి ఒక విధంగా మైనస్ అవుతోంది.
 
ఢిల్లీ ధర్నాతో జగన్ ఏం సాధిస్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. జగన్ పొలిటికల్ గా సంచలన విజయాలను సాధిస్తే చూడాలని ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీ.ఆర్.ఎస్ పరోక్షంగా జగన్ కు మద్దతు ఇస్తున్నా డైరెక్ట్ గా మద్దతు ఇచ్చే పరిస్థితులు మాత్రం లేవనే సంగతి తెలిసిందే. జగన్ పొలిటికల్ గా యాక్టివ్ కావడం ఫ్యాన్స్ కు మాత్రం సంతోషాన్ని కలిగిస్తోంది. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటే జగన్ కు కచ్చితంగా మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: