HYD వాసులకు గుడ్ న్యూస్.. ఇక రూ. 5 కే టిఫిన్?

praveen
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా హామీల అమలు దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా ఇప్పటికే అమలు చేసింది అన్న విషయం తెలిసిందే.. ఇక ఇటీవల ఏకకాలంలో ఏకంగా లక్ష రూపాయలు రుణమాఫీ కూడా చేసి చరిత్ర సృష్టించింది రేవంత్ సర్కార్.

 ఇక ఇప్పుడు హైదరాబాద్ నగర వాసులందరికీ కూడా ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజు వేలాదిమంది కడుపు నింపుతుంది. కేవలం ఐదు రూపాయలకే ఎంతో పౌష్టికాహారాన్ని అన్నపూర్ణ కేంద్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందజేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్ళినవారు లేదంటే ఇక నగరంలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఇలా అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజు కడుపు నింపుకుంటున్నారు. అది కూడా కేవలం అతి తక్కువ ఖర్చుతోనే కావడం గమనార్హం.

ఇలా ప్రతి రోజు మధ్యాహ్నం అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు ఉదయం సమయం లో కూడా అందరి కడుపు నింపేందుకు సిద్ధమైంది అనేది తెలుస్తుంది. ఈ క్రమం లోనే హైదరాబాద్ వాసులందరికీ కూడా ఒక అదిరి పోయే గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఏకంగా హైదరాబాద్లో అన్నపూర్ణ కేంద్రాల ద్వారా టిఫిన్స్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారట. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి అధికారులు ఇప్పటికే దీనిపై కసరతులు కూడా చేస్తున్నారట. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను కూడా జిహెచ్ఎంసి పరిధిలో అందుబాటులోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. కేవలం ఐదు రూపాయలకు ఉదయం సమయంలో టిఫిన్ అందించాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: