మరలా రెబెల్ ట్యాగ్ తగిలించుకున్న రఘురామ కృష్ణం రాజు?

Suma Kallamadi
రఘురామ కృష్ణం రాజు గురించి జనాలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రఘురామ ఓ రెబల్ నేతగా తనదైన మార్క్ మాటలతో మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించాడు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్ధలు కొట్టే రకం. ఈ క్రమంలోనే తనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో మాట్లాడారా? అన్న అనుమానాలు వినబడుతున్నాయి. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంటున్న మాటలు ఆ అనుమానాలకు బీజం వేసాయి. మరోసారి ఆయన రెబెల్ అవతారం ఎత్తబోతున్నారా అన్న సందేహాన్ని ఆ మాటలు కలిగిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
ఇకపోతే, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ క్రిష్ణం రాజు టీటీడీ చైర్మన్ పోస్ట్ మీద కన్నేశారా? అనే అనుమానాలు ఇపుడు కూటమిలో బయలుదేరాయి. తనకు ఈ కీలకమైన పోస్ట్ దక్కాలని ప్రజలు అనుకుంటున్నారు అని రఘురామ చెప్పకనే చెప్పేస్తున్నారు. అంతే కాకుండా ఉండి నియోజకవర్గం నుంచి ఇప్పటికే నలుగురు టీటీడీపీ చైర్మన్లుగా పనిచేశారు అని గుర్తు చేశారు కూడా. ఇక వారంతా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కొసమెరుపు. తన సొంత చిన్నాన్న మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు కూడా టీటీడీ చైర్మన్ అయ్యారని చెప్పారు. అయితే ఇవన్నీ క్రెడిటేరియా అని తాను అననని అధినాయకత్వం మనసులో ఏముంటే అదే జరుగుతుందని కుండబద్దలు కొట్టి మరీ వ్యాఖ్యలు చేశారు.
తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే అంతకంటే ఇంకో భాగ్యం లేదంటూ ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ఇపుడు మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి. తాను వెంకటేశ్వర స్వామి వారి భక్తుడిని అని, తమ కుటుంబానికి స్వామి వారు ఇలవేలుపు అని చెప్పుకొచ్చారు. ఆయన సేవలో తరించే అదృష్టం వస్తుంది అనుకుంటే? ఎవరు కాదనుకుంటారు అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కకపోవడం పట్ల ఆయన ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేసే లాగానే మాట్లాడినట్టు కనబడుతోంది. ప్రజలు అయితే తాను కచ్చితంగా మంత్రిని అవుతాను అనుకున్నారని, కానీ అలా జరగలేదని ఈ సందర్భంగా అయన వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: