బాబు, పవన్.. విడివిడిగా ఢిల్లీ టూర్ ఎందుకో?

Suma Kallamadi
బాబు, పవన్.. విడివిడిగా ఢిల్లీ టూర్ వెళ్లడాన్ని ఓ వర్గం పదే పదే బూతద్దంలో పెట్టి చూపిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీలోని కూటమి సర్కారు మధ్యలో చిచ్చుపెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఆ వర్గం ఏమిటనేది ఇక్కడ వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక కూటమి ప్రభుత్వం గెలుపులో.. చంద్రబాబు, పవన్ చాలా కీలక పాత్రను పోషించారు. జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అయితే పోటీచేసిన ప్రతిచోటా గెలిచి ఓ దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించారు.
ఇక పవన్ కళ్యాణ్ టీడీపీ రాజకీయానికి ఏ స్థాయి ఊతం ఇచ్చారో అందరికీ తెలిసినదే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనేది నగ్న సత్యం. ఒకరినొకరు పరస్పర గౌరవాభిమానాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ.. భవిష్యత్తులో దూరం పెరగటానికి అవసరమైన అనుమానాలను రేకెత్తిస్తూ... జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. బాబు, పవన్... ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ? మరెవరు తక్కువ? అన్నది అస్సలు ప్రశ్నే కాదు. అయితే.. అలాంటి చర్చకు అవకాశం ఇచ్చేలా ఈ ఇద్దరు అధినేతల వ్యవహారశైలి ఉందంటూ కూతలు కూస్తున్నారు.
విషయం ఏమిటంటే... తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇక ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన 2 రోజులకే జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ టూరు పెట్టుకున్నారు. పవన్ టూర్లో భాగంగా మంత్రి హోదాలో ఢిల్లీలో జరిగే సమీక్షా సమావేశానికి హాజరవుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారం ముందస్తుగా వస్తుంది కాబట్టి ఢిల్లీకి వెళ్లే ముందు ఇద్దరు అధినేతలు కలిసికట్టుగా వెళ్తే బావుంటుంది కదా అనేది వారి వాదన. కానీ రెండు మూడు రోజుల సమయాన్ని వృధా చేసుకోవడం అలాంటివారికి కుదురుతుందా? అనే ప్రశ్న వారి మదిలో మెదలకపోవడం చాలా విచారకరం. కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక... ఎవరి పనుల్లో వారు ఇద్దరూ తనమునకలై ఉన్నారు... ఒక ఘడియ కూడా సమయం వృధా చేసే ఉద్దేశం అటు బాబుకి గానీ, పవన్ కి గానీ లేవు... అందుకే పవన్ కళ్యాణ్ పెండింగ్ ఉన్న సినిమాలను కూడా కంప్లీట్ చేయడం లేదు.. ఈ విషయాలు ఆ వర్గం కుసంస్కారులకు అర్ధం కావాలంటే ఓ శతాబ్దం పడుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: