పార్లమెంట్ ఫైట్ : ఏపీ నిధులు గోరంత కష్టాలు కొండంత.. ఎంపీలు ఏకమైతేనే పరిస్థితి మారుతుందా?

Reddy P Rajasekhar
ఏదో సామెత చెప్పినట్టు ఏపీ కష్టాలు తీరడం అనేది సులువైన విషయం కానే కాదు. సీఎంలు మారినా ప్రభుత్వాలు మారినా ఏపీలో అప్పులు పెరిగిన స్థాయిలో ఆదాయం పెరగడం లేదని అభివృద్ధి జరగడం లేదని అంగీకరించాల్సిన కఠినమైన వాస్తవం. నిధుల లేమి వల్లే ఏపీలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సైతం జరిగ్గా జరగడం లేదని చెప్పవచ్చు. ఏపీ ఎంపీలంతా ఏకమై గళం వినిపిస్తే మాత్రమే ఈ పరిస్థితి మారుతుంది.
 
కేంద్రంలో సైతం బీజేపీ పరిస్థితి అద్భుతంగా లేదు. బీజేపీకి సైతం ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ నిధులు గోరంత ఉంటే ఏపీకి కష్టాలు మాత్రం కొండంత ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరాలంటే భారీ మొత్తంలో నిధులు అవసరమని చెప్పవచ్చు. ఏపీకి ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని సమాచారం అందుతోంది.
 
14 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ చెల్లించాలన్నా కూడా భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఆగష్టు నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రెండు పథకాల అమలు దిశగా అడుగులు పడ్డాయి. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ తో పాటు అన్న క్యాంటీన్లను ఆరోజు నుంచి అమలు చేయనున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ కు భారీ మొత్తంలో నిధులు ఇచ్చి బీజేపీ సహాయసహకారాలు అందిస్తుందేమో చూడాలి. పార్టీలకతీతంగా ఎంపీలంతా ఏకమై ఏపీ అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకునేలా ముందడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు. ఏపీలో అమరావతి అభివృద్ధితో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం అభివృద్ధి జరిగేలా కూటమి నిర్ణయాలు ఉంటాయేమో చూడాల్సి ఉంది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏపీ కష్టాలు తగ్గే దిశగా కూటమి వైపు నుంచి అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: