షరతులు లేకుండా పథకాల అమలే బాబుకు అసలైన సవాల్.. రూల్స్ తో ప్రజలను మెప్పిస్తారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సునాయాసంగా సీఎం కావడానికి ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాలు కారణమని చెప్పవచ్చు. షరతులు లేకుండా పథకాల అమలే బాబుకు అసలైన సవాల్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రకటించిన పథకాలలో కొన్ని అలివి కాని హామీలు ఉన్నాయి. 50 ఏళ్లకే, పింఛన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లాంటి హామీలు వాస్తవంగా సులువుగా అమలు చేసే హామీలు కాదు.
 
అదే సమయంలో ప్రకటించిన పథకాలకు సంబంధించి షరతులు మరీ దారుణంగా ఉన్నా ప్రజల అంగీకారం లభించదు. మరీ కఠినమైన రూల్స్ లేకపోతే పథకాల అమలు కోసం ఎక్కువ మొత్తం నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ముందు ఉన్న సవాళ్లు భారీ సవాళ్లు, బరువైన సవాళ్లు అని చెప్పవచ్చు. చంద్రబాబు సలహాదారుల సలహాలతో సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
 
మహిళలకు ఫ్రీ బస్, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు లాంటి భారీ ఖర్చు కాని పథకాలను మాత్రం వీలైనంత వేగంగా అమలు చేసే దిశగా అడుగులు పడకపోతే కూటమి తీవ్రంగా నష్టపోతుంది. కూటమి నేతలు తెలివిగా పథకాలకు సంబంధించిన విధి విధానాలను లీక్ చేసి ప్రజల రెస్పాన్స్ చూసి ఆ తర్వాత నిర్ణయాలలో మార్పులు చేయడం జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
తక్కువ ఖర్చు ఉన్న పథకాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఎంతో మంచిదని చెప్పవచ్చు. అన్న క్యాంటీన్లను మరో నెల రోజుల్లో కూటమి మొదలుపెట్టనుండటం గమనార్హం. మొత్తం 183 అన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అన్న క్యాంటీన్ల అమలు వల్ల పేదవాడి ఆకలి తీరనుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు తప్పటడుగులు వేస్తే మాత్రం ప్రజలు బాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోరని ఫీలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఏపీలో కూటమి పాలన ఏ విధంగా ఉండనుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: