ఏపీ: త్వరలోనే విశాఖ ఫైల్స్.. మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు..!

Divya
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి శ్వేత పత్రాలను సైతం రోజు కొకటి చొప్పున విడుదల చేస్తూనే ఉంది ఏపీ ప్రభుత్వం.. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం రుషి కొండ భవనాలను వెలుగులోకి తీసుకువచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసిపి పార్టీని ట్రోల్ చేయడం కూడా జరిగింది. ఎన్నికల ఫలితాలు అనంతరం రుషికొండ భవనాలను సైతం వెలుగులోకి తీసుకురావడంతో తాజాగా ఇప్పుడు మరొక బాంబు పేల్చారు. ఇందులో భాగంగానే త్వరలోనే విశాఖ ఫైల్స్ అనే ఒక్క పేరుతో ఒక సిరీస్ విడుదల చేస్తామంటూ కూడా తెలియజేశారు.

విశాఖలో జరిగిన భూదాన్దాలన్నీ కూడా అందులో పొందుపరుస్తామంటూ గంట తెలియజేశారు.ఈ సమయంలోనే వైసీపీ పార్టీలో భూ దందాల  పైన ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విశాఖ భూ అక్రమ లలో చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన వారు కూడా ఉన్నారంటూ పలు రకాల ఆరోపణలు చేశారు మాజీ మంత్రి. ఈ సమయంలోనే కొత్తగా అక్రమాలకు తావు లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని కూడా తెలిపారు. నిజానికి ఈసారి మంత్రి పదవి గంటకు లేకపోయినప్పటికీ ఆయన అసంతృప్తితో ఉన్నారని చాలామంది అనుకున్నారు.

కానీ ఆయన మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా వైసిపి టార్గెట్ ను చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఈ మధ్య రుషికొండ భవనాల వద్దకు తానే స్వయంగా మీడియాను తీసుకువెళ్లి మరి హడావిడి చేయడం జరిగింది. ఆ భవనాల లోపల ఏముంది ఎలా తయారు చేశారని విషయాలను కూడా బయట ప్రజలకు చూపించారు.అయితే అక్కడ ఉన్న బాత్రూంలో బాతు డబ్బులు ఇతర విలువైన ఫర్నిచర్ పైన కూడా ఒక వీడియో చేయడం జరిగింది. దీంతో నలుగురు నేతలు మంత్రి పదవి కోసమే గంట ఇలా హడావిడి చేస్తున్నారనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: