బాబును బద్నాం చేయడమే వైసీపీ టార్గెట్.. ఆ ప్రచారాల విషయంలో జాగ్రత్త పడాల్సిందే!

Reddy P Rajasekhar
కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు పడిన కష్టం అంతాఇంతా కాదనే చెప్పాలి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా చంద్రబాబు ఏపీలో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించడంలో సక్సెస్ అయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి బాబును బద్నాం చేయడమే వైసీపీ టార్గెట్ అనే కామెంట్లు అయితే సోషల్ మీడియ వేదికగా వ్యక్తమవుతున్నాయి.
 
సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఎలాంటి షరతులు విధించినా వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా నుంచి వెంటనే కౌంటర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో తల్లికి వందనం స్కీమ్ అమలు విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరహా ప్రచారాల వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ తరహా ప్రచారాల విషయంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిదని చెప్పవచ్చు.
 
వైసీపీ కార్యకర్తలు, నేతలు సైతం బాబు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తారో తెలుసుకోవడానికి ఒకింత ఆసక్తిగా ఉన్నారు. వైసీపీకి విమర్శించే అవకాశం లేకుండా పాలించాల్సిన బాధ్యత, పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత కూటమిపై ఉంది. మరోవైపు పవన్ కళాణ్ మీడియాకు, సినిమాలకు, షూటింగ్ లకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
విధి విధానాలను అధికారికంగా ప్రకటిస్తే మాత్రమే ఏ పథకం విషయంలో అయినా సందేహాలకు తావు లేకుండా ఉంటుంది. బాబు అనుకూల పత్రికలు సైతం కొన్నిసార్లు పథకాల నిబంధనలకు సంబంధించి తప్పు వార్తలనే ప్రచారంలోకి తెస్తుండటంతో ఏపీ ఓటర్లలో ఒకింత గందరగోళ పరిస్థితి నెలకొందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చాక దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం ఉండదు. అయితే జగన్ వైపు నుంచి మరీ ఘాటుగా విమర్శలు లేకపోవడం కూటమికి ప్లస్ అని చెప్పవచ్చు. ఎన్నికల్లో ఫలితాల దెబ్బకు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ సైతం సైలెంట్ అయిపోయిన పరిస్థితి నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: