కల్కితో అమెరికా కింగ్ అనిపించుకున్న ప్రభాస్?

Purushottham Vinay

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కల్కి 2898 ఏడి' బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.గత నెల 27న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ని టాక్ ని అందుకుంది. దీంతో జనాలు వర్షాలను, వరల్డ్ కప్ ని కూడా పక్కనబెట్టి సినిమా థియేటర్స్ కి క్యూ కట్టారు. అందుకే హౌస్ ఫుల్ షోలతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఏకంగా 800 కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టింది.రెండు వారలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం 1000 కోట్ల మార్క్ ని కూడా దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు, మూవీ టీం చెబుతున్నాయి. పదిహేను రోజుల్లో కల్కి మూవీ ఏకంగా రూ.543.35 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. గ్రాస్ కలెక్షన్స్ బట్టి చూస్తే దాదాపు 1100 కోట్లకు దగ్గరిలో ఈ సినిమా ఉంది. ఇక ఈ రెండు వారాల కలెక్షన్స్ తో బాలీవుడ్ టాప్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. 


పఠాన్ సినిమా లైఫ్ టైం నెట్ షేర్ కలెక్షన్స్ రూ.543.09 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ రూ.1055. నేషనల్ మీడియా కూడా కల్కి, పఠాన్ ని క్రాస్ చేసేసిందని కథనాలు వేస్తుండడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పఠాన్ పని అయ్యిపోయింది, ఇక జవాన్ మూవీ బ్యాలన్స్ ఉంది. దాని రికార్డుని కూడా కల్కి సినిమా క్రాస్ చేసేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జవాన్ నెట్ కలెక్షన్స్ వచ్చి రూ.637.95. మరి కల్కి ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే అమెరికాలో పఠాన్ వసూళ్ళని కూడా దాటేసింది కల్కి.. అమెరికాలో పఠాన్ 17 మిలియన్ డాలర్ల పైగా వసూలు చేసి బాహుబలి 2 తరువాత స్థానంలో నిలవగా ఇప్పుడు కల్కి దాదాపు 18 మిలియన్ డాలర్ల దాకా వసూళ్లు చేసి పఠాన్ దాటి బాహుబలి 2 తరువాత స్థానంలో నిలిచింది. బాహుబలి 2 ఏకంగా 20 మిలియన్ డాలర్ల పైగా వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. దీంతో టాప్ 2 రికార్డులు ప్రభాస్ పేరు మీదే ఉన్నాయి. అందుకే ప్రభాస్ ని అమెరికా కింగ్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: