కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని అత్యధిక కాలం పాలించినటువంటి పార్టీ. ఈ పార్టీ తీసుకువచ్చినటువంటి సంస్కరణలే ఇప్పటికీ దేశంలో ఎన్నో అమలవుతున్నాయి. ఈ పార్టీ పాలనలో ఎన్నో విపత్కర పరిస్థితులు వచ్చాయి అయినా ప్రజల్ని కాపాడగలిగారు. ఆ విధంగా సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని పాలించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అనేక ఇబ్బందులు పడుతోంది. చివరికి అక్కడ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొన్నిసార్లు కూటమి ప్రభుత్వాన్ని కూడా నడిపింది. యూపీఏ కూటమి ఏర్పడి 2004, 2009లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అంతేకాకుండా పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మైనారిటీ ప్రభుత్వమైన కానీ పాలన చేయగలిగారు. యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంటు ఇలా అనేకం వచ్చాయి. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోనే ఎక్కువ సమయం ఉంది ప్రతిపక్షంలో ఉన్నది చాలా తక్కువ సమయమే అని చెప్పవచ్చు. వాజ్ ఫెయి ఉన్నప్పుడు 13 నెలలు, ఆ తర్వాత మరో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. రాష్ట్రం బీజేపీ పాలనలో మరో 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉంటుంది. ఎప్పుడైనా సరే లోక్ సభలో తేడా వచ్చింది కానీ రాజ్యసభలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష స్థానంలో ఎప్పుడైనా బలంగానే ఉంటూ వచ్చింది.
అలాంటి ప్రతిపక్ష స్థానంలో ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయట. 1952 తర్వాత 25 మార్కు దాటడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రధాన కారణం ఒక ఇద్దరు ఎంపీలు లోక్సభలో గెలిచి ఆ రెండు సీట్లు రాజ్యసభలో ఖాళీ అవడం , ఆ ప్లేస్ లో బీజేపీ గెలవడం ఈ విధంగా హర్యానా కావచ్చు, ఇంకో సీట్ కావచ్చు బిజెపి కైవసం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కోల్పోవడం స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెస్ కు మొదటిసారి అని చెప్పవచ్చు.