బాబు మార్క్‌: చరిత్రలో నిలిచిపోయేలా ఇసుక పాలసీ..?

Veldandi Saikiran

*  ఇసుక మాఫియాకు చెక్
* సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ఇసుక పాలసీ
* ఇసుక విధానం కోసం మార్గదర్శకాలు
*2019, 2021 ఇసుక విధానాల రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది.  164 స్థానాలతో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా...  చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంబడే... ఇసుక పాలసీలో కీలక మార్పులు తీసుకువచ్చారు. 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేసి...  ఉచితంగా ఇసుక సరఫరా పాలసీని తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు.
 ఇసుక సరఫరా విషయంలో వైసీపీ ప్రభుత్వంలో... చాలా అవినీతి జరిగిందని టిడిపి మొదటి నుంచి చెబుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్లను కూడా ఎగగొట్టి.. పెద్దిరెడ్డి, నందిగాం సురేష్ లాంటి వారు అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు కూడా తరలించాలని టిడిపి చెబుతోంది. పేదలు ఇల్లు కట్టుకోవడానికి కూడా... ఇసుక దొరకని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. కొత్తగా ఫ్రీ ఇసుక పంపిణీ  పథకాన్ని తీసుకువచ్చింది.
 ఇక ఈ పథకం మొత్తం కలెక్టర్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం...  కలెక్టర్ చైర్మన్గా ఆయా జిల్లాలకు ఉంటారు. వారి కింద... అవసరమైన సిబ్బందిని కూడా నియమించుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఇక తవ్వకాలు, లోడింగ్, పాలనా ఖర్చులు  లాంటివి ఇసుక తీసుకుపోయే వారి పైన పడతాయి. మీరు ఆన్లైన్లో మాత్రమే... ఆ డబ్బులు కట్టాలి. ఒకటి అన్నకు 1400 వరకు చార్జీ పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇదంతా బ్రోకర్ల చేతిలోకి వెళ్లకుండా... మైనింగ్ శాఖ వెబ్ సైట్ ను రూపొందించింది.

Www.mines.ap.gov.in వెబ్సైట్ లో మనం ఇసుక కోసం బుక్ చేసుకోవాలి. ఒక వినియోగదారుడు రోజుకు గరిష్టంగా 20 టన్నులు మాత్రమే ఇసుక కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఈ ఇసుకను భవన నిర్మాణాల కోసం మాత్రమే వాడుకోవాలని కఠిన నియమ నిబంధనలను తీసుకువచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. అక్రమంగా ఇసుక తరలిస్తే.. దాదాపు లక్ష రూపాయల వరకు ఫైన్ ఉండేలా కూడా కొత్త చట్టం తీసుకువచ్చింది. దీనివల్ల నిరుపేదలు కూడా ఇసుక... చాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు అన్నమాట. గతంలో కంటే ఇప్పుడు... ఇసుక పాలసీ బాగుందని కొంతమంది చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: