టీడీపీ భవిష్యత్ లీడర్ గా లోకేష్ కు అద్భుత అవకాశం.. నిలబెట్టుకుంటాడా..?

murali krishna
* విద్యాశాఖను ఛాలెంజింగ్ గా  తీసుకున్న లోకేష్
* కీలక మార్పుల దిశగా త్వరితగత అడుగులు
* విద్యతో పాటు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఎన్నికలలో టీడీపీ,బీజేపీ ,జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.గత ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించిన వైసీపీ ప్రభుత్వం ఈ సారి కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.తిరుగులేని విజయం సాధించిన కూటమి ప్రభుత్వం తరుపున చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించారు.అయితే గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి పాలైన లోకేష్ పట్టు వీడని విక్రమార్కుడిలా మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఏకంగా 90 వేలకు పైగా మెజారిటీతో అద్భుత విజయం సాధించాడు.అంతే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో ఈ సారి కూడా లోకేష్ కు  ఐటీ మినిస్టర్ గా కేబినెట్ లో చోటు దక్కింది.అయితే ఈ సారి లోకేష్ కు ఐటీ శాఖతో పాటు విద్య శాఖ కూడా రావడం విశేషం.తనని విద్యా శాఖ వద్దని చాలా మంది సూచించారని ఇటీవల లోకేష్ తెలిపారు.అయితే తాను విద్యా శాఖను ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకున్నట్లు  లోకేష్ తెలిపారు

.విద్యా శాఖలో మార్పులు తీసుకువస్తామని గతంలో కంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల జాయినింగ్ పర్సన్తేజ్ పెంచుతామని లోకేష్ తెలిపారు.ఇప్పటికే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశామని త్వరలోనే డీఎస్సి ప్రక్రియ పూర్తి చేసి కొత్తగా టీచర్లుగా నియమితులైన  వారికి  నియామక పత్రాలు ఇస్తామని లోకేష్ తెలిపారు.అలాగే ప్రభుత్వ టీచర్లను బోధనేతర పనులకు దూరంగా ఉంచుతామని తెలిపారు.పిల్లకు క్వాలిటీ విద్యను అందించేలా టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు.విద్యా రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు.అలాగే విద్యాశాఖతో పాటు లోకేష్ ఐటీ శాఖా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్రంలో పలు పరిశ్రమలు పెట్టుబడి పెట్టేలా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు.దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ద్యేయంగా పెట్టుకున్నారు.రెండు శాఖలలో వచ్చే శాఖపరమైన  సమస్యలను త్వరితగతంగా  పరిష్కరించేందుకు  లోకేష్ ప్రయత్నిస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: