యూపీ : ఘోర ప్రమాదం.. 18 మంది దుర్మరణం..అస్సలు ఏం జరిగిందంటే..?

murali krishna
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది.బుధవారం తెల్లవారు జామున ఉన్నావ్ వద్ద డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది.ఈ ప్రమాదం లో భారీగా ప్రాణ నష్టం జరిగింది.ఏకంగా 18 మంది మృతి చెందగా.. 19 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన డబుల్ డెక్కర్ బస్సు బీహార్ లోని మోతిహారి నుంచి ఢిల్లీ వెళ్తుంది. బెహతా ముజావర్ ప్రాంతంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని కిమీ.నం 247 వద్ద ఉదయం 05.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు, మిల్క్ ట్యాంకర్ ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు క్షతగాత్రులను వెంటనే బంగార్‌మావ్ సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. అయితే జరిగిన ప్రమాదం తీవ్రత భారీగా ఉండటం తో మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. అలాగే మరికొన్ని  మృతదేహాలు బస్సు సీట్ల మధ్య ఇరుక్కు పోయాయి.

ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు..మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం అందించారు.అలాగే ఉన్నావ్ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అయితే ప్రమాదం ధాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది.సీట్ల మధ్య ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు.  ఈ  ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే తీవ్రంగా గాయ పడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తు వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనపై విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: