బాబోరు 20 రోజులకే ఏపీకి పెట్టిన బొక్క రు. 750 కోట్లు... వైసీపీ భగ్గు భగ్గు..?
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పోవటానికి చాలానే కారణాలు ఉన్నాయి. అయితే పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇసుక ధరలు ఒకటి. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత టీడీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఉన్న విధానాన్ని రద్దు చేసింది. ఇసుక సరఫరాను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ఫలితంగా తక్కువ ధరకు ఇసుకను అందించలేకపోయింది. తక్కువ ధరలకు ఇసుకను అందజేసేలాగా ఓ కొత్త వ్యవస్థను రూపొందించడంలోనూ జగన్ విఫలమయ్యారు.
ఈ నిర్లక్ష్య నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ ప్రాజెక్టులను గందరగోళంలో పడేసింది, సాధారణ ప్రజలు భరించగలిగే దానికంటే ఇసుక ధరలు అదుపు లేకుండా పెరుగుతూనే పోయాయి. ఇసుక ధరల కారణంగా నిర్మాణాలు ఆగిపోవడంతో రోజువారీ కూలీలు పనిలేక అవస్థలు పడ్డారు. జగన్ చేసిన అతి పెద్ద తప్పుల్లో ఇదొకటి అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు.
చంద్ర బాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఈ సమస్య వల్ల ప్రజలకు ఎదురవుతున్న కష్టాలను గుర్తించింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంది. జులై 8 ఓ కొత్త విధానం అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచింది. రవాణా, సీగ్నియర్ ఛార్జీలు మాత్రమే కొనుగోలుదారు చెల్లించేలాగా విధానాలను మార్చేసింది.
ఈ కొత్త విధానం ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగానికి ఎంతగానో దోహదపడింది. ఉచిత ఇసుకను పునఃప్రారంభించడంతో, రాబోయే ఆరు నెలల్లో భవన నిర్మాణ కార్యకలాపాలు వేగవంతం కానుండటంతో రియల్ ఎస్టేట్‌కు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అదనంగా, అన్ని జిల్లాల్లో ఇసుకను నిరంతరాయంగా సరఫరా చేయడం వల్ల కూలీలకు డైలీ పని దొరుకుతుంది.
అయితే కొత్త ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు నష్టం వాటిల్లుతుందని వైసీపీ పార్టీ భగ్గుమంటోంది, బాబోరు 20 రోజులకే ఏపీకి పెట్టిన బొక్క రూ.750 కోట్లు అని వైసీపీ పెద్ద ఎత్తున మండిపడుతోంది. అయితే ఇసుక ధరలు తగ్గడం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దపీట వేసినట్లు అవుతుందని, దీనివల్ల క్యాష్ ఫ్లో పెరుగుతుందని టీడీపీ నేతలు అంటున్నారు.