జగన్ షర్మిల గొడవలకు అసలు కారణం వేరు.. మొండితనమే ఇద్దరినీ ముంచేస్తోందా?

Reddy P Rajasekhar
జగన్ షర్మిల కలిసి రాజకీయాలు చేసిన సమయంలో ప్రజల నుంచి వీళ్లిద్దరికీ పూర్తిస్థాయిలో మద్దతు లభించింది. జగన్, షర్మిల అనుబంధం గురించి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. జగన్ జైలులో ఉన్న సమయంలో సైతం పార్టీని నిలబెట్టడంలో పార్టీకి ప్రజల్లో మంచి గుర్తింపును తీసుకొనిరావడంలో షర్మిల సూపర్ సక్సెస్ అయ్యారు. అలాంటి షర్మిల ప్రస్తుతం జగన్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు.
 
వైఎస్ ఫ్యామిలీలో విబేధాలను కడప ప్రజలు సైతం హర్షించడం లేదు. సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ జరిగిన ప్రచారం సైతం వైసీపీకి ఊహించని స్థాయిలో డ్యామేజ్ చేసిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆస్తుల వల్లే జగన్ షర్మిల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతున్నా అసలు కారణాలు వేరే ఉండొచ్చని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
షర్మిల అస్తులే ముఖ్యమని అనుకుంటే లీగల్ గా కోర్టుకు వెళ్లి కూడా సమస్యను పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంది. అయితే షర్మిల మాత్రం ఆ రూట్ లో అడుగులు వేయడం లేదు. జగన్, షర్మిల మధ్య గ్యాప్ కు చిన్నచిన్న సమస్యలే కారణమైతే విజయమ్మ ఆ సమస్యలను సులువుగానే పరిష్కరించేవారు. పార్టీకి సంబంధించి జగన్, షర్మిల మధ్య గ్యాప్ వచ్చి ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
షర్మిల పొలిటికల్ కెరీర్ కు జగన్ అడ్డు పడటం వల్లే ఆమె సంచలన నిర్ణయాలు తీసుకున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ షర్మిలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారో లేక ఆమెను దూరం పెడుతూ రాజకీయాలను కొనసాగిస్తారో అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. షర్మిల, జగన్ కలిసి పని చేయాలని అభిమానులు భావిస్తుండగా వాళ్లు మాత్రం మొండితనంతో ముందుకెళ్తున్నారు. జగన్ వైసీపీకి పూర్వ వైభవం రావడం కోసం సరికొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: