ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో మందు పార్టీ.. ఎగబడిన వేలాదిమంది...

Suma Kallamadi
2024 లోక్‌సభ ఎన్నికల్లో చాలామంది ఎంపీగా గెలుపొందారు వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కొంతమంది ఎంపీలు తన విజయాలను వెరైటీగా జరుపుకుంటున్నారు. తాజాగా ఒక నేత తన సక్సెస్ కి కారణమైన కార్యకర్తలకు తనదైన శైలిలో థాంక్స్ చెప్పుకున్నారు. నగర శివార్లలో ఈ పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలకు ఫ్రీగా మందు, నాన్ వెజ్ ఫుడ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడిది తీవ్ర చర్చకు దారితీసింది.
అయితే ఈ సక్సెస్, థాంక్స్ పార్టీకి ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలకు తరలివచ్చినట్లు సమాచారం. వచ్చిన వారిని కాదనకుండా బీరు, హార్డ్ లిక్కర్, మాంసాహార భోజనం వడ్డించారని తెలుస్తోంది. ఈ పార్టీపై పోలీసులు తాజాగా రెస్పాండ్ అయ్యి ఎక్సైజ్ శాఖకు తెలియజేసినట్లు టాక్. అసలు వివరాలలోకి వెళ్తే... 2024 పార్లమెంట్ ఎలక్షన్స్‌లో చిక్కబళ్లాపూర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, కర్ణాటక మాజీమంత్రి డాక్టర్ కే సుధాకర్ ఎంపీ గెలిచి ఘన విజయం సాధించారు. తర్వాత బీజేపీ - జేడీఎస్ కార్యకర్తలకు మందు, నాన్ వెజ్ పార్టీ ఇచ్చారు. బెంగళూరు సిటీ శివార్లలోని నెలమంగళలో ఈ కార్యక్రమం జరిగింది అని సమాచారం.
స్థానిక బీజేపీ అధ్యక్షుడు స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమానికి పోలీసులు హాజరయ్యారు. బీజేపీ, జేడీఎస్‌ కార్యకర్తలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా, అనూహ్యంగా పెద్ద ఎత్తున జనం రావడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో అదుపు చేయలేమని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిందని, కాబట్టి ఇది పోలీసుల తప్పు కాదని ఒక పోలీసు అధికారి పేర్కొన్నారు.
నిర్వాహకులు ఈవెంట్ అనుమతి కోసం రూ.11,500 పే చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలియచేశారు. ఎంపీ డాక్టర్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన వార్తల్లో చూసే వరకు తనకేమీ తెలియదని, పార్టీ కార్యకర్తలే ప్లాన్ చేశారని అన్నారు. తన 20 ఏళ్ల రాజకీయాల్లో పార్టీ కార్యకర్తలకు డబ్బులు ఇవ్వడం తప్పుకాదని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: