టీడీపీ-జనసేన బంధానికి పదేళ్లు : పళ్ళ శ్రీనివాస్

praveen
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అటు తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది అన్న విషయం తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలను చంద్రబాబు కొత్త వ్యక్తికి అప్పగించారు అన్న విషయం తెలిసిందే. టిడిపిలో కీలక నేతగా కొనసాగుతున్న పల్లా శ్రీనివాసరావుకి ఇక ఈ బాధ్యతలు దక్కాయి.

 అయితే ఈ బాధ్యతలను చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనను కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే టిడిపి జనసేన పార్టీల బంధం గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ఏకంగా టిడిపి జనసేన పార్టీల మధ్య బంధానికి దశాబ్ద కాలం గడిచింది అంటూ పల్లా శ్రీనివాసరావు అన్నారు. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలి అంటూ ఇరు పార్టీల నేర్తుల నిర్ణయించారు అంటూ చెప్పుకొచ్చారు.

 ఈ క్రమంలోనే  రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పార్టీ శ్రేణుల్లో ఎక్కడ పోరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాక్షస పాలన అంతమందించాలని కూటమికి ఇచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని. నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించుకోవాలని ఇద్దరి మధ్య చర్చ జరిగిందట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యం వల్లే మోడీ ఆశీస్సులతో ఏర్పాటైన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పళ్ళ శ్రీనివాస్ అన్నారు. జనసైనికులు క్షేత్రస్థాయిలో చూపించిన ఉత్సాహం తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమిష్టి కృషి రాష్ట్ర ఓటర్ల తీర్పులో ప్రతిబింబించింది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: