తెలంగాణలో చంద్రబాబు రీ-ఎంట్రీ... ఇక BRS ఖేల్ ఖాతమేనా?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యాక్టివ్‌ అయ్యారు. త్వరలోనే తెలుగు దేశం పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ ఎన్టీఆర్‌ భవన్‌లో తెలంగాణ టీడీపీ తమ్ముళ్లతో సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే టీడీపీ పార్టీకి కొత్త స్ట్రాక్చర్ తీసుకొస్తానని ప్రకటించారు. టీడీపీలో తెలంగాణ యువకులకు అవకాశం ఇస్తానని వెల్లడించారు.

తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని వివరించారు. మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకెవరు కూడా క్యాన్సర్ తో చనిపోవద్దని ఎన్టీఆర్ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించారు..ఇప్పుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నడుస్తుస్తుందని గుర్తు చేశారు. తెలుగు జాతి గ్లోబల్ నంబర్ వన్ గా ఉండాలి..మొన్నటి వరకు బ్రిటన్ ను పాలించింది కూడా మన భారతీయుడే అని గుర్తు చేశారు.

ప్రపంచంలో అందరికంటే ఆమోదమైన వ్యక్తులు భారతీయులు అని.. అందులో ఎక్కువ శాతం మాన తెలుగు వారే ఉన్నారన్నారు. ప్రపంచానికి సేవ చేసే శక్తి మన భారతీయులకు ఉంది..మనకు యువ శక్తి ఎక్కువగా ఉందని కొనియాడారు. తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో నేను తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని గుర్తు చేశారు బాబు..నా రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేదన్నారని వివరించారు.

రాబోయే రోజుల్లో కమిటీలు వేసి నిర్ణయాలు తీసుకుందాం..అదిలాబాద్ మొదలు శ్రీకాకుళం వరకు నేను తిరగని ప్రాంతం లేదని తెలిపారు. మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు.. దానికి సేవాభావంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. నా చివరి బొట్టు వరకు ప్రజా సేవ చేస్తాను..వచ్చే 30 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఒక విజన్ ఆలోచిస్తానని తెలిపారు. విజన్ 2020 అని నేను ఎప్పుడో చెప్పాను..కానీ అప్పుడు అందరూ ఎగతాళి చేశారన్నారు. సెల్ ఫోన్ కడుపు నింపుతుండా అని మాట్లాడారన్నారు బాబు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్న విజన్ 2047 అభివృద్ధి చెందిన భారత్ ఉంటుందన్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: