వైసీపీలో పుష్పరాజ్‌లు.. ఆపే సత్తా పవన్‌కి ఉందా..??

Suma Kallamadi

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా సమస్యలను పరిష్కరిస్తే అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. అటవీ శాఖను సైతం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ పెరిగిపోతోందని ఇంతకుముందే జనసేన నేతలు ఆరోపణలు చేశారు ఇప్పుడు దానిని అడ్డుకోవడంపై టీడీపీ, జేఎస్పీ, బీజేపీలు దృష్టి సారించాయి. పవన్ కళ్యాణ్ ఈ స్మగ్లింగ్ విషయంలో ప్రత్యేక దృష్టిని కనబరుస్తున్నారు.
రీసెంట్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పుష్పరాజ్‌లను పట్టుకోవాలని పోలీసు శాఖకు అటవీశాఖ మంత్రిగా పవన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఫారెస్ట్ మినిస్టర్ గా ఇచ్చిన తొలి ఆర్డర్స్ అవే కావడం విశేషం. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా జోరుగా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని కోరారు.
పుష్ప సినిమాను ఉద్దేశించి సినిమాల్లో స్మగ్లింగ్ సీన్లు చూడటమంటే సరదాగా అనిపిస్తుందని, అవి ఆటలుగా కనిపిస్తాయని వీటి వల్ల అటవీ సంపదకు ఎంతో నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆయన సీరియస్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. నేపాల్‌ దేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డికి చెందిన ఎర్రచందనం దుంగలను అధికారులు పట్టుకున్నట్లు ఆధారాలతో సహా నిరూపించే ఓ ఫైల్ పవన్ టేబుల్‌పైకి వచ్చింది. ఈ ఆపరేషన్ వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందని పవన్ బలంగా నమ్ముతున్నారు.
అందుకే కడపలోని శ్రీగంధం డంపింగ్‌ యార్డుపై నిఘా పెంచాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేకాకుండా ఎర్రచందనం దుంగలను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల సంఖ్యను వీలైనంత ఎక్కువగా పెంచేయాలని పవన్ పిలుపునిచ్చారు. మొత్తం మీద అటవీ శాఖ మంత్రిగా పవన్ "పుష్ప రాజ్" (స్మగ్లర్లు) ను పట్టుకోవడమే తన మొదటి లక్ష్యం చేసుకున్నారు.
 మరి త్వరలోనే వీరిని పవన్ కళ్యాణ్ పట్టుకోగలుగుతారా ఈ ఎర్రచందనం అక్రమ వ్యాపారానికి చెక్‌ పెడతారా అనేది తెలియాల్సి ఉంది. పవన్ గెలిచాక కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు అన్ని సమస్యలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. ఇటీవల చాలా ఎలా క్రితం కిడ్నాప్ కు గురైన ఆంధ్రప్రదేశ్ మహిళలను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: