పవన్ లో పెరిగిన ఆధ్యాత్మికం..అద్భుత పాలన కోసమేనా.?

Pandrala Sravanthi
- పదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది
- ఇకనుంచి పాత పవన్ కాదు కొత్త పవన్ కనిపిస్తారు.
- ప్రజా సంక్షేమం కోసమే ఆధ్యాత్మిక భావం.

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా దూకుడు స్వభావం ఉండే హీరో. సాధారణంగా ఈయన బద్రి,  గుడుంబా శంకర్,  తొలిప్రేమ వంటి సినిమాలు చూస్తే పవన్ కళ్యాణ్ దూకుడు స్వభావం ఎలా ఉండేదో మనకు అర్థమవుతుంది.  ప్రస్తుత పవన్ కళ్యాణ్ ను, ఆ సినిమాల్లో కనిపించే పవన్ కళ్యాణ్ ను చూస్తే మాత్రం ఆయన ఈయనేనా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగక మానదు.  అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతటి స్థాయికి వస్తారని ఎవరు ఊహించి ఉండరు. కానీ ఆయన ఏదైనా పట్టుపట్టాడు అంటే సాధించేవరకు విడిచిపెట్టడు. జనసేన పార్టీని స్థాపించి 2014, 2019 ఎన్నికల్లో  గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు. చాలా మంది విమర్శించారు. నీలాంటి సినిమాలు చేసుకునే వాడికి రాజకీయాల అవసరమా, సినిమా డైలాగులు రాజకీయాల్లో పనిచేయవు అని హేళన చేశారు. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం ఏ ఒక్కరిని కూడా విమర్శకు, ప్రతి విమర్శ చేయలేదు. కేవలంతా అనుకున్న టార్గెట్ పై మాత్రమే దృష్టి పెట్టి ముందుకు వెళ్లగలిగారు. అలాంటి పవన్ కళ్యాణ్  పిఠాపురంలో గెలిచిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
 పవన్ లో వచ్చిన మార్పు :
 పవన్ కళ్యాణ్ తను అనుకున్నది సాధించారు. ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారో అప్పటి నుంచే ఆధ్యాత్మిక భావం పెరిగిపోయింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఆయన వారాహి అమ్మవారిని మరియు కొండగట్టు ఆంజనేయస్వామి ని ఎక్కువగా పూజించేవారు. ఎన్నికలకు ముందే ఈ రెండు దేవాలయాలకు వెళ్లి గట్టిగా మొక్కుకున్నారు.  ఆయన మొక్కులకు  ఈ దేవుడు కూడా కరుణించేశారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అద్భుత మెజారిటీతో విజయం సాధించింది. దేశంలో ఏ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలు ఇప్పటివరకు గెలవలేదు. పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి రికార్డు తిరగరాసింది.  ఓక్క దెబ్బకు పార్టీ నిలబడడమే కాకుండా దేశ స్థాయిలో కూడా ఆయన కీలకంగా మారారు. ఆయన కష్టానికి  చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పదవి అలంకరించారు.

ఎప్పుడైతే ఆయన పదవి  చార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచే పవన్ లో పవన్ మాట తీరులో కానీ, బాడీ లాంగ్వేజ్ లో కానీ విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. మొదట్లో దూకుడు స్వభావం ఉండే పవన్  పూర్తి స్థాయిలో తగ్గించుకున్నారు. దాన్ని ఇంకా కంట్రోల్ చేసుకోవడం కోసం ఆధ్యాత్మిక భావన వైపు అడుగులు వేశారు. తాను గెలిచిన వెంటనే  గుడికి వెళ్లి పూజ చేసి దీక్ష చేపట్టారు.  ఈ దీక్షలో ఆయన కేవలం పండ్లు, పానీయాలు మాత్రమే తీసుకుంటారట. ఈ విధంగా భక్తి భావం వైపు తాను మారితే పూర్తిస్థాయిలో పాలనపై ఏకాగ్రత పెరుగుతుందని పవన్ భావిస్తున్నారట. అందుకే రాజకీయాల్లోకి రాగానే ఆయనలో ఆధ్యాత్మికత పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: