బాగా మారిపోయిన బాబు.. ఏపీ ప్రజలకు వరం..??

Suma Kallamadi
గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో చాలా తప్పులు జరిగాయి. సంక్షేమ పథకాలు చక్కగా అమలయ్యాయి తప్ప మిగతా అన్ని విషయాల్లో జగన్ సరిగా నడుచుకోలేదు. ముఖ్యంగా అధికారాన్ని ఎవరిది వారికి అప్ప చెప్పకుండా మొత్తం పవర్‌ను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు జగన్. మంచి పాలనలో ఇది పెద్ద లోపంగా మారింది సాధారణంగా ఏపీలో చాలా శాఖలు ఉంటాయి. వాటికి మంత్రులు ఉంటారు. వారికి కొన్ని అధికారాలు ఉంటాయి అధికారాలను వాళ్లకే ఇవ్వాలి అప్పుడే ఆ శాఖలో అందరినీ సమన్వయ పరుచుకుంటూ అభివృద్ధి చేసే ఆస్కారం ఉంటుంది. కానీ జగన్ అందుకు మార్గాన్ని సుగమనం చేయలేదు. కట్ చేస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారయ్యింది.
అయితే ప్రస్తుత ఏపీ మంత్రి చంద్రబాబు మాత్రం ఆయా శాఖల మంత్రులకు సర్వాధికారాలను అప్పజెప్పారు. జనసేన ఎంపీల విషయం పక్కన పడితే ఇప్పుడు టీడీపీ మంత్రులు తమకు అప్పగించిన రంగాలపై పూర్తి అధికారాన్ని పొందారు. కింద ఉన్న అధికారులతో వివిధ విషయాలపై సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి అధికారి ఆ రంగం మంత్రికే జవాబుదారీ అయ్యారు.
 ఇలా పవర్ అందరి చేతులకి ఇవ్వడం చాలా గొప్ప ఆలోచన అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు చంద్రబాబు పరిపాలన అనేది సెంట్రలైజ్డ్ గా ఉండేది అంటే చంద్రబాబుపై మొత్తం నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆయన మంత్రులు వారికి ఏది మంచిగా అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకొని అమలు చేయవచ్చు ఏదైనా తేడా వస్తే ఆ తప్పులకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు నడుచుకునే అవకాశం ఉంది. అలాగే తమకు ఇచ్చిన స్వేచ్ఛను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మంచి అభివృద్ధిని చూపిస్తారు.  
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేయడం ఇదే ఆఖరిసారి కావచ్చు. ప్రజలు చివరిసారిగా అతనుకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఏపీ ప్రజలకు బాబుకు ఎంత ధన్యవాదాలు చెప్పుకున్న తక్కువే. చివరిసారి ఉన్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వారికి మంచి చేసి మంచి నేతగా పేరు తెచ్చుకొని దిగిపోవాలని బాబు చూస్తున్నట్లు కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: