ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. ఈ ప్రభుత్వం ఇంతటి మెజారిటీ సాధించడానికి పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అనుచర వర్గం అంతా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. ముఖ్యంగా చాలా మంది సెలబ్రిటీలు ప్రచారంలో భాగమై కూటమికి సహకరించారు. ఆ సహకార బలమే ఏపీ లో టిడిపి కూటమి అంతటి మెజారిటీ సీట్లు సాధించింది. ఇందులో ముఖ్యంగా పవన్ వెంట ఎంతోమంది సినీ నటులు వచ్చారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైపర్ ఆది. టిడిపి కూటమి మరియు జనసేన పార్టీలు ఏపీలో గెలవడం కోసం ఎంతో కష్టపడి ప్రచారం చేశారు. ఎక్కువ రోజులు పవన్ వెంట ఉంటూ ప్రచారాన్ని నిర్వహించారు.
పిఠాపురంలో పవన్ అంతటి మెజారిటీ రావడానికి ఈయన ప్రత్యేక సహకారం అందించారని చెప్పవచ్చు. ఈ విధంగా పవన్ వెంట ఉంటూ జనసేన పార్టీ లో కీలక నాయకుడిగా ఎదిగినటువంటి హైపర్ ఆదికి కూటమి సర్కారు ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ ఆయనకి ఏమి ఇస్తున్నారయ్యా అంటే.. హైపర్ ఆదికి ఎమ్మెల్సీ గా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయమై గత కొంతకాలంగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ప్రభుత్వంలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో హైపర్ ఆది కి చాన్స్ ఇస్తారని సమాచారం అందుతోంది. హైపర్ ఆదికి ఈ పదవి ఇవ్వడానికి ప్రధాన కారణం ముందట.
ఆయన ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎలాంటిది కూడా ఆశించకుండా సొంతంగా పార్టీ మీద అభిమానంతో ప్రచారం చేశారట. దీంతో ఆయన కష్టాన్ని గుర్తించినటువంటి జనసేన పార్టీ మరియు టిడిపి నాయకులు ఆయనకు ఏదైనా పదవి ఇవ్వాలని ఆలోచన చేశారట. ఎమ్మెల్సీ అయితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. మరి చూడాలి హైపర్ ఆదిని ఎమ్మెల్సీ వరిస్తుందా లేదంటే ఏదైనా నామినేటెడ్ పోస్టు అందిస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.