జగన్ కు అసెంబ్లీ పరీక్ష.. అసలేం చేయబోతున్నాడు?

praveen
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తీరు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది. ప్రస్తుతం అందరిలో ఇదే ప్రశ్న నెలకొంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం వైసీపీ 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఇక ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేకపోయింది. ఇలాంటి సమయంలో ఇక అసెంబ్లీ సమావేశాలు జగన్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే విషయంపైనే అందరు దృష్టి ఉంది. కాగా ఇటీవల అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కేవలం ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు జగన్.

 స్పీకర్ నియామకం సమయంలో కూడా అక్కడ కనిపించలేదు. దీంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కాగా జూలై రెండవ తేదీ నుంచి అటు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయ్. ఈ క్రమంలోనే బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టబోతున్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలే జగన్కు అసలైన పరీక్ష అని ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు దాదాపు రెండున్నరేళ్ళ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టకుండానే హాజరయ్యారు. ఒకవైపు జగన్ ప్రభుత్వం ఎంత హేళన చేసి మాట్లాడుతున్నా..  బాబు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా అన్ని తట్టుకొని నిలబడ్డారు. అలా నిలబడ్డారు కాబట్టి ప్రజల మనసులు గెలిచి ఇక ఇప్పడు సీఎంగా అయ్యారు.

 అయితే గతంలో ఓడిపోయినప్పటికీ ప్రమాణ స్వీకారం సమయంలో స్పీకర్ ఎన్నిక సమయంలోను అసెంబ్లీలోనే ఉన్నారు చంద్రబాబు. కానీ జగన్ మాత్రం ఏకంగా తన ప్రమాణ స్వీకారం పూర్తికాగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు వస్తారా టిడిపి సందించే కౌంటర్లకి బదులు ఇస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ అలా జగన్ చేయకపోతే పార్టీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఇక టిడిపిలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అదే సమయంలో ప్రజల పక్షాన పోరాడని నాయకుడు మాకెందుకు అని ఇక ఏపీ ప్రజలు అటు జగన్ ను మరింత దూరం పెట్టే ఛాన్స్ ఉంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతిపక్ష హోదా దక్కకపోయినప్పటికీ  ఏకంగా  బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా జగన్ వ్యవహరిస్తారా లేదా అన్నది అందరిలో నెలకొన్న ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: