టార్గెట్ పార్లమెంట్ : కూటమి ప్రభుత్వానికి పోలవరమే అతిపెద్ద టార్గెట్.. మరి ఈ సారి పూర్తవుతుందా..?

murali krishna
* కూటమి ప్రభుత్వానికి అతి పెద్ద టార్గెట్ పోలవరం
*చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు రాబడతారా ..?
*ప్రాజెక్ట్ పూర్తయితే చరిత్ర సృష్టించినట్లే ?
ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎప్పటినుంచో ఊరిస్తున్న సమస్య పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడం.గోదావరి నది జలాలను వృధాగా సముద్రంలోకి కలిసిపోవడం ప్రజలకు ఆందోళన కలిగించింది.వృధాగా సముద్రంలో కలిసిపోయే ఆ నీరు ఎన్నోహెక్టార్ల పంట  భూములను సస్యశ్యామలం చేస్తుంది.ఈ సమస్యను గుర్తించిన అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి పట్టించుకోని ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టింది .అయితే ఒకానొక సమయంలో అటవీశాఖ నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.కేవలం కాలువ పనులు మాత్రమే జరిగాయి.2009 నాటికీ ప్రాజెక్ట్ కు   కావలసిన అన్ని పర్మిషన్స్ వచ్చాయి.అనూహ్యంగా అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించడంతో జలయజ్ఞం పరిధిలోనే ప్రాజెక్ట్స్ పనులన్నీ ఆగి పోయాయి.ఆ తరువాత పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా కల్పించాలని డిమాండ్స్ చాలా వచ్చాయి.అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ ప్రతిపాదన పట్టించుకోలేదు.ఆ తరువాత రెండు రాష్ట్రాలు విభజించబడ్డాయి.అప్పటి ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉండటంతో పోలవరంకు జాతీయ హోదా ఇస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఎన్డిఏ అనూహ్య విజయం సాధించింది.అలాగే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ పనులను త్వరితగతంగా పూర్తి చేయాలనీ ఆదేశించారు.చంద్రబాబు హయాంలోనే పోలవరంకు జాతీయహోదా లభించింది.ఈ ప్రాజెక్ట్ పనులు అప్పటి ప్రభుత్వంలో దాదాపు 70 శాతం పూర్తి అయ్యాయి.కానీ ఆ తరువాత ప్రభుత్వం మారడంతో పోలవరం పనులు నిలిచిపోయాయి.కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వేయడంతో ప్రాజెక్ట్ వ్యయం బాగా పెరిగింది.దీనితోకేంద్రం నుండి నిధులను రాబట్టలేక అలాగే తెచ్చిన నిధులను కూడా మరో విధంగా వాడడంతో ప్రాజెక్ట్ పనులు పూర్తి కాలేదు.దీనితో ఈ సరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని గెలిపించుకున్నారు.మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.ఇప్పుడు చంద్రబాబు ముందు వున్నా అర్థింపెద్ద సవాల్ పోలవరం ఈ సారి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితేనే ప్రజలు మరోసారి టీడీపీ ని గెలిపిస్తారు.దీనితో ఎలాగైనా పూర్తి చేయాలనీ చంద్రబాబు త్వరితగతంగా పనులు చేయిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ కు కావాల్సిన నిధులను కేంద్రం ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.మరి ఈ సరైన ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: