చంద్రబాబు : టీడీపీని మళ్లీ లేపుతున్న రేవంత్‌ రెడ్డి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు గురువు శిష్యులు అని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా... అదే నిజం. జడ్పిటిసి స్థాయి నుంచి... ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎదిగాడంటే... దాని వెనుక టిడిపి పార్టీ కచ్చితంగా ఉంది.
అలాగే... తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి...  కావడానికి ఇండైరెక్టుగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.  ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే కేసీఆర్ను ఓడించేందుకు.... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారని.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో జైల్లో ఉన్న చంద్రబాబు... అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పోటీ చేయకుండా నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగానే.. తెలంగాణ టిడిపి నేతలు సపోర్ట్ ఇచ్చేలా కీలక ఆదేశాలు కూడా ఇచ్చారట చంద్రబాబు నాయుడు. దాని ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత... చంద్రబాబు తన గురువు కాదని... సహచరుడు మాత్రమే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఏపీ అలాగే తెలంగాణలో ఉన్న టిడిపి నేతలు రేవంత్ రెడ్డి పై సీరియస్ అయ్యారు.
అయితే ఆ వివాదాన్ని.. చల్లబరిచేందుకు తాజాగా... రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ఒకరోజులో 18 గంటలకు పైగా పని చేసే వ్యక్తి. అలాంటి ముఖ్యమంత్రి ఏపీలో ఉన్న సమయంలో..  నేను తెలంగాణ డెవలప్మెంట్ చేసేందుకు రోజంతా పని చేయాలి అంటూ... చంద్రబాబు నాయుడును ప్రశంసించారు. అలాగే చంద్రబాబు నాయుడు కారణంగానే ఈ స్థాయికి వచ్చామని అర్థం వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు... రేవంత్ రెడ్డి పై చల్లబట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: