ఏపీ అసెంబ్లీ : పవన్ పై ఎంతోమంది కళ్ళు... ఆయన ఆ తప్పు చేస్తే కష్టమే..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014వ సంవత్సరంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక 2019వ సంవత్సరం ఎన్నికలలోకి దిగాడు. అందులో భాగంగా రెండు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తే రెండింటిలో కూడా ఓడిపోయాడు. దానితో పవన్ సీఎం కావాలి అనే కలను పక్కన పెడితే అసెంబ్లీకి వెళ్లే కల కూడా ఆ సమయంలో నెరవేరలేదు. దానితో ఆయన ఏ స్థాయిలో నిరుత్సాహపడ్డాడో అదే స్థాయిలో ఆయన అభిమానులు, జనసైనికులు కూడా అంతే డీలపడ్డారు. తమ అభిమాన నటుడు, రాజకీయ నాయకుడు కచ్చితంగా అసెంబ్లీకి వెళ్లి అక్కడ ప్రజల సమస్యల గురించి గొంతే చెప్పాలి అని వారంతా భావించారు.

ఇక 2024వ సంవత్సరం ఎన్నికలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అందులో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం మాత్రమే కాకుండా తన పార్టీ నుండి పోటీ చేసిన ప్రతి ఒక్కరు గెలవడంతో నూతన ఉత్సాహంతో ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఇక నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ మొదటి సారి అసెంబ్లీలోకి అడుగు పెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు. తన అభిమానులు, జనసైనికుల కోరిక కొంతవరకు నెరవేరింది. ఇక రెండవ కోరిక ప్రజా సమస్యలపై గొంతే చెప్పడం.

ఈ విషయంలోనే ఆయన అభిమానులు, జనసైనికులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి పోటీ చేశాయి. వైసిపి ఒంటరిగా పోటీలోకి దిగింది. వైసీపీ కనుక భారీ స్థానంలో సీట్లను సాధించి ఉండి ఆ పార్టీ అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ గొంతేతి సమస్యలపై మాట్లాడేవాడు. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. అందులో పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉండటంతో ఆయన ప్రజా సమస్యలను అంత గట్టిగా మాట్లాడగలరా..? ప్రజా సమస్యలను గట్టిగా చెప్పడానికి ధైర్యం చేయగలడా..? అనే సందేహం చాలా మంది జనాలలో వస్తుంది.

మరి పవన్ కళ్యాణ్ టిడిపి పై కూడా ప్రజా ఈ సమస్యలను గట్టిగా చెప్పినట్లు అయితే ఆయన సక్సెస్ అయినట్లే అవుతుంది. కానీ ప్రజా సమస్యల గురించి పెద్దగా ఆయన మాట్లడనట్లు అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అసెంబ్లీలో పవన్ గొంతెత్తి మాట్లాడే కళ మాత్రం ఈసారి కూడా నెరవేరదు. ఏ పార్టీ అయినా ఎవరు అయినా ప్రజా సమస్యలను గట్టిగా చెప్పనట్లయితే పవన్ కి కొంత కష్టమే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: