అసెంబ్లీ: జగన్ ప్రమాణం.. లోకేష్ కసి.. క్యా సీన్ హై?

Purushottham Vinay
•ఎట్టకేలకు ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎంట్రీ ఇచ్చిన జగన్ 


•జగన్ ప్రమాణం చేస్తుంటే కసితో రగిలిపోతున్న లోకేష్ 


•క్యా సీన్ హై అంటున్న నెటిజన్స్ 


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ : జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కొత్త అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. అయితే అసెంబ్లీలో జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న క్రమంలో ఒక ముచ్చట చోటు చేసుకుంది. సభలో  ఉన్న మొత్తం అధికార కూటమి సభ్యులు అంతా కూడా ఆయననే చూస్తూండిపోయారు.ప్రత్యేకించి ముందు వరసలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తున్నంత సేపూ కూడా ఆయన్ని అలానే చూస్తూండిపోయారు. లోకేష్ మదిలో భావాలు ఏమిటో తెలియదు కానీ ఆమె ఫేస్ చూస్తే మాత్రం ఎంతో కసిగా కోపంతో రివేంజ్ తీర్చుకోవాలి అన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి వైపు చూస్తున్నట్లుగా అనిపించింది అని నెటిజన్స్ అంటున్నారు.జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ చంద్ర బాబుగా ఈ 2024 ఎన్నికలు జరిగాయి. ఇక నారా లోకేష్ యంగ్ లీడర్ గా టీడీపీ విజయంలో కొమ్ము కాశారు. ఆ టైంలో ఆయన జగన్ మోహన్ రెడ్డి మీద ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు. మరో వైపు చూస్తే జగన్ మోహన్ రెడ్డి కూడా ఇండైరెక్ట్ గా నారా లోకేష్ మీద సెటైర్లు వెస్తూ వచ్చారు.ఈ ఇద్దరూ కూడా ఒకటి రెండు సందర్భలలో తప్ప ఎపుడూ ఎదురుపడలేదు.


2019 వ సంవత్సరంలో శాసనమండలిలో నారా లోకేష్ విపక్షంలో ఎమ్మెల్సీగా ఉన్నపుడు ఒకసారి సభకు సీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి రావడం జరిగింది. అపుడు అందరితో పాటు లోకేష్ కూడా లేచి ఆయనకు నమస్కరించారు. అది 2019 వ సంవత్సరం కొత్తల్లో జరిగింది. ఆ తరువాత వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న రాజకీయ సమరం ఎంతో తీవ్రంగా సాగింది.దాంతో అయిదు సంవత్సరాలు గిర్రున తిరిగేసరికి అది కాస్తా వ్యక్తిగత స్థాయిలోనూ సాగిపోయింది. అయితే ఎన్నికల రాజకీయాలు అన్నీ కూడా ప్రజాస్వామ్యం అన్న దాంట్లోనే ముడి పడి ఉంటాయి. ఎవరైనా కూడా అంతిమంగా ప్రజలకు సేవ చేయడానికే ఉంటారు. దాంతో ఈసారి అయినా అసెంబ్లీలో వివాదాలు చోటు చేసుకోకుండా ప్రజా సమస్యల మీద అదే అంతా కసిగా పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. రివేంజ్ లు పక్కన పెట్టి ప్రజల కోసం పని చేస్తే సరైన ఫలితం ఉంటుంది అంటున్నారు.అయితే ఈసారి అసెంబ్లీ తీరు కనుక చూస్తే అది సాధ్యపడుతుందా అంటే ఏదైనా సాధ్యమే అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా నారా లోకేష్ జగన్ వైపు అదే పనిగా రెప్పార్చకుండా చూడడం మాత్రం మాములుగా లేదు. క్యా సీన్ హై అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: