ఏపీ అసెంబ్లీ లో నేను : తొలిసారి అసెంబ్లీకీ పవన్ కల్యాణ్..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందిగా..

murali krishna
*ఎమ్మెల్యే గా అసెంబ్లీ లో పవన్ కల్యాణ్ ప్రమాణం
*కొణిదల పవన్ కల్యాణ్  అనే నేను ఈ మాట కోసం ఎంతో కాలంగా ఫ్యాన్స్  ఎదురుచూపు
*ఎట్టకేలకు అసెంబ్లీ లో అడుగు పెట్టిన పవన్ కల్యాణ్  
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 164  సీట్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది.కూటమిలో భాగంగా  జనసేన అధినేత పవన్ కల్యాణ్ 21 అసెంబ్లీ సీట్లు ,2  పార్లమెంట్ సీట్లు తీసుకోని అన్నిటిని కూడా గెలిపించుకొని 100  శాతం స్ట్రైక్ రేట్ సాధించారు.దీనితో పవన్ పేరు దెస వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది.గత ఎన్నికలలో తాను పోటీచేసిన భీమవరం ,గాజువాక రెండు నియోజక వర్గాలలో కూడా పవన్ కల్యాణ్ ఓటమి చెందారు.అయినా కూడా దిగులు చెందకుండా ఎంతో ఓర్పుతో నిలబడ్డారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదని బీజేపీ ,టీడీపీ లతో కూటమిగా ఏర్పడి పవన్ రాజకీయాలను ఓ మలుపు తిప్పారు.గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి ఎంతో బలంగా వున్న వైసీపీ పార్టీతో పవన్ కల్యాణ్ గట్టిగా పోరాడారు.వారు వ్యక్తిగతంగ ఎంత ట్రోల్ చేసిన కూడా పవన్ తన పట్టును కోల్పోలేదు.చివరివరకు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు.

పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలో తాను పిఠాపురం నుంచి పోటీ చేసారు.ఆ నియోజక వర్గంలో వైసీపీ తరుపున వంగ గీత పోటీలోకి దిగారు.పవన్ కల్యాణ్ ని ఎలాగైనా ఓడించాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది.అలాగే పవన్ కల్యాణ్ తరుపున సినీ ప్రముఖులు ,అభిమానులు ఎంతగానో ప్రచారం చేసారు.అలాగే మెగా ఫామిలీ కూడా పవన్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచింది.పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం అని వైసీపీ నేతలు ఎన్నో ప్రగల్బాలు పలికారు.కానీ పవన్ కల్యాణ్ పిఠాపురంలో అఖండ మెజర్టీ తో విజయం సాధించారు.అంతే కాకుండా డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేసారు.నేడు అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారందరు కూడా అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేస్తారు.తాజాగా పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసారు.పవన్ ను ఎమ్మెల్యేగా అసెంబ్లీ లో చూడాలని ఎన్నో ఏళ్లగా కలలు కంటున్నా ఫ్యాన్స్ కి ఆ కల నేటితో నెరవేరింది.ఇప్పుడు పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఎంతో సంతోషంలో వున్నారు.ప్రస్తుతం పవన్ అందరి రాజకీయ నాయకుడిలా కాకుండా నిత్యం ప్రజలలో వుండాలి అని భావిస్తున్నట్లు ససమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: