పవన్ :తలనొప్పిగా మారిన వాలంటరీలు..32 వేల మంది ఆడపిల్లల పరిస్థితి ఏంటి..?

Divya
పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఎంతగానో ఎదురుచూసిన శుభ సమయం రానే వచ్చేసింది. నిన్నటి రోజున ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా బాధ్యతలను సైతం తీసుకున్నారు. అలాగే కేంద్ర కార్యాలయానికి చేరుకొని విజయవాడ నుంచి ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా మొదటిసారి అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్. అలాగే పవన్ కళ్యాణ్ కు పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను స్వీకరించారు.

ఇలా బాధ్యతలు తీసుకున్నారో లేదో పవన్ కళ్యాణ్ ముందు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది... అదేమిటంటే గతంలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. ముఖ్యంగా.. వాలంటరీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డేటాను తీసుకొని ఒంటరి మహిళలు ఆడపిల్లలు కనపడకుండా పోవడానికి వాలంటరీల కారణమంటూ గతంలో ఒక విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో వైసీపీ సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా చేస్తున్నారు.

అదేమిటంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే వాలంటరీ ద్వారా కనపడకుండా పోయిన 32,000 మంది ఆడపిల్లలను ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే అధికారాన్ని ఉపయోగించుకొని మరి వాళ్ళని పట్టుకొని కుటుంబానికి అప్పజెప్పాలని అలా అప్పజెప్పి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జడ శ్రావణ్ ఒక వీడియో ద్వారా వెల్లడించారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.. సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా తనకు కాన్ఫిడెన్షియల్ గా తనతో చెప్పారని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా తమ ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నారని.. ఒకవేళ వాలంటీర్ల ద్వారా మిస్సయిన ఆడపిల్లలను వారి కుటుంబాలకు అప్పచెపితే తమ ప్రఖ్యాత మరింత పెరుగుతుందంటూ ఆయన మాట్లాడుతూ ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. గతంలో పవన్ కళ్యాణ్ వాలంటరీల పైన మాట్లాడిన మాటలు ఇప్పుడు తనకే చుట్టుకునేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: