వాసంశెట్టి సుభాష్ : మొదటి విజయంతోనే మంత్రి... ఇకపై అసలు ఆట షురూ..?

Pulgam Srinivas
2024వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఇక కూటమికి అద్భుతమైన స్థానంలో అసెంబ్లీ స్థానాలు రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన తన మంత్రివర్గంలో ఎక్కువ శాతం సీనియర్లకు అవకాశం ఇస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు సీనియర్లకు ఎక్కువ శాతం ప్రాముఖ్యత ఇవ్వకుండా తన మంత్రివర్గంలో ఎక్కువ యువతకు అవకాశం ఇచ్చారు.

దీనితోనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను సరికొత్త దిశ వైపు ప్రయాణించడానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 
అందులో భాగంగా వాసంశెట్టి సుభాష్ అనే యువకుడికి కూడా తన మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. వాసంశెట్టి సుభాష్ రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు. ఆయన ఎస్‌ఏఎఫ్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించాడు.

2022 లో జరిగిన అమలాపురం అల్లర్ల ఘటన తర్వాత వైసీపీ నాయకులతో విభేదాలు రావడంతో ఆయన జనవరి 2024 లో వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశాడు. 
వాసంశెట్టి సుభాష్ ఆ తరువాత మండపేట 'రా కదలిరా' సభలో చంద్రబాబు సమక్షంలో జనవరి 20 న తెలుగు దేశం పార్టీ లో చేరి 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రామచంద్రపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పై 26291 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ కి ఎన్నికై జూన్ 12 న కార్మిక , కర్మాగార , బాయిలర్స్‌ & వైద్య బీమా సేవ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

ఈయన గెలిచిన మొదటి సారే మంత్రి కావడంతో ఈయనపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానితో రాబోయే ఐదేళ్లలో తన నియోజకవర్గానికి ఎంతో మంచి చేస్తాడో అని ఇక్కడి నియోజకవర్గం ప్రజలు భావిస్తున్నారు. అలాగే అసెంబ్లీలోను ఈయన తనదైన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను తిప్పి కొట్టడం మాత్రమే కాకుండా జనాల మనసును కూడా చూరగొంటాడు అని అనేక మంది ప్రజలు భావిస్తున్నారు. మరి ఈయన గెలిచిన మొదటి సారి మంత్రి కావడంతో ఈయన నియోజకవర్గ ప్రజలకు ఇతనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి వాటిని ఈయన ఏ స్థాయిలో నిలబెట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: