వంగవీటికి అదిరిపోయే ట్రీట్‌ ప్లాన్‌ చేసిన చంద్రబాబు?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ కోసం పని చేసిన... నాయకులు అలాగే కార్యకర్తలను ఆదుకునేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చుకున్న చంద్రబాబు నాయుడు... మంత్రి పదవులు రాని వారి కోసం ప్రత్యేక పోస్టులు సిద్ధం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే టికెట్లు రాని వారి కోసం కూడా అదిరిపోయే స్కెచ్ వేస్తున్నారట చంద్రబాబు.

ఇక మొన్నటి ఎన్నికల్లో టికెట్ రాని వారిలో వంగవీటి రాధా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వంగవీటి రాధా కోసం... కీలక పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు  సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత 20 సంవత్సరాలుగా గెలుపు అనే విషయమే మర్చిపోయారు వంగవీటి రాధా. వంగవీటి మోహనరంగా తనయుడిగా  రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన... వంగవీటి రాధా... 2004 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచారు.

అది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 2004 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి... 2009 వచ్చేసరికి ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వంగవీటి రాధ. కాపు సామాజిక వర్గం కావడంతో... చిరంజీవితో నడిచారు. కానీ ప్రజారాజ్యం పార్టీలో కూడా ఓడిపోయారు. ఆ తర్వాత 2014 సమయానికి వైసీపీ నుంచి పోటీ చేసిన కూడా... వంగవీటి రాధాకు నిరాశే ఎదురయింది. ఇక 2019 సంవత్సరంలో...  టిడిపి పార్టీలో చేరారు వంగవీటి రాధా. అయితే అప్పుడు వంగవీటి రాధా సేవలను వినియోగించుకుంది కానీ... ఆయనకు టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ.

ఈ తరుణంలో 2024 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు... వంగవీటి రాధా వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ జగన్ పైన ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో... టిడిపిలోనే ఉండి.... పార్టీ కోసం పని చేశారు. ఎన్నికల్లో టికెట్ రాకపోయినా.... కాపులను తెలుగుదేశం పార్టీ వైపు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు వంగవీటి రాధా. అందుకే పార్టీ కోసం పని  చేసిన వంగవీటి రాధకు త్వరలోనే ఎమ్మెల్సీ  పదవి కట్టబట్టేందుకు చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారట. అతనికి పదవి ఇస్తే... తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయ్యే ఛాన్స్ ఉందని..ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్లస్ అవుతుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: