బాబు గొప్ప.. బాబే గొప్ప.. అన్న క్యాంటీన్ల విషయంలో బాబుకు ఎవరూ సాటిరారుగా!

Reddy P Rajasekhar
మన దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ ఆకలితో మరణిస్తున్న వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నచ్చిన, రుచికరమైన ఆహారం ఎక్కువ ఖర్చు చేసి తినడం సాధ్యం కాక పౌష్టికాహార లోపాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు.
 
ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంతో గ్రేట్ అని ఆయనకు ఎవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అన్న క్యాంటీన్ల ద్వారా బ్రేక్ ఫాస్ట్, భోజనం కేవలం 5 రూపాయలకే అందించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉండగా చంద్రబాబు మాత్రం ప్రజలకు మేలు జరిగితే చాలని ఫీలవుతున్నారు. అతి త్వరలో అన్న క్యాంటీన్లకు సంబంధించి విధివిధానాలు ఖరారు కానున్నాయి.
 
అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఎవరికి అప్పగిస్తుందనే చర్చ జరుగుతోంది. అన్ని దానాలలో అన్నదానం గొప్పది కాగా చంద్రబాబు చేసేది దానం కాకపోయినా తక్కువ ఖర్చుతో బ్రేక్ ఫాస్ట్, భోజనం చేయడం ద్వారా ఖర్చులు తగ్గి ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. అన్న క్యాంటీన్ల ఫుడ్ క్వాలిటీ బాగుంటే మాత్రం బాబుకు ఏపీలో తిరుగుండదని చెప్పవచ్చు.
 
అన్న క్యాంటీన్ల విషయంలో బాబు సక్సెస్ అయితే మరికొన్ని రాష్ట్రాలు సైతం ఈ దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి స్కీమ్స్ అమలవుతున్నా నాణ్యత విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తే ఆ ప్రభావం హోటళ్లపై కూడా పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఏపీ ప్రజలు అన్న క్యాంటీన్లను త్వరగా ఓపెన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్న క్యాంటీన్లలో 5 రూపాయలకే ఆహారం అందించడం విషయంలో బాబును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా బాబు పాలన ఉండనుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: