రోజా దూల తీరిపోద్దా... ఏ రేంజ్‌లో స్కెచ్ అంటే...!

RAMAKRISHNA S.S.
- అనిత‌కు రోజాకు అస్స‌లు ప‌డ‌దే.. హోం మంత్రి ఊరుకుంటుందా
- న‌గ‌రిలో ఆగ‌డాలు.. మంత్రిగా ఆరోప‌ణ‌లు... తిన్న‌దంతా క‌క్కాల్సిందే
- జ‌గ‌న్ కోసం ఓవ‌ర్‌యాక్ష‌న్ చేసి ఇప్పుడు బుక్ అయిపోయిందే
( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )
జ‌బ‌ర్ద‌స్త్ రోజా. వైసీపీ హ‌యాంలో చివ‌రి రెండు సంవ‌త్స‌రాల‌పాటు మంత్రిగా ఉన్నారు. అయితే.. ఆమె మంత్రిగా కంటే కూడా.. మాట‌ల మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఇటు జ‌న‌సేన‌, అటు టీడీపీ, ఇంకోవైపు బీజేపీని కూడా.. నిత్యం విమ‌ర్శించేవారు. టీడీపీ సైకిల్ కిల్ల‌యిపోయింద‌ని.. ఇక‌, షెడ్డుకేన‌ని వ్యాఖ్యానిం చారు. జ‌న‌సేన.. అంటే.. జ‌నం లేని సేన అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప‌వ‌న్ వివాహాల‌పైనా ఆమె విరుచుకుప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి.

నిజానికి ఒక‌ర‌కంగా.. మంత్రిగా ఆయ‌న చేయాల్సిన ప‌నులకంటే కూడా.. నోరు చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తూ .. పార్టీ అధినేత జ‌గ‌న్ దృష్టిలో ప‌డేందుకు మాత్ర‌మే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. ప‌లితంగా రోజా అంటే.. రాజ‌కీయంగా ప‌నికిరాని నాయ‌కురాలు అనే పేరు తెచ్చుకున్నారు. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు అయితే.. ఒకసారి తీవ్రంగా విమ‌ర్శించారు. ఇక‌, ఇప్పుడు పార్టీ మారి ప్ర‌భుత్వం మారిపోయిన ద‌రిమిలా.. రోజా మ‌రింత టార్గెట్ అవుతారు.

ముఖ్యంగా హోం మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వంగ‌ల‌పూడి అనిత కు .. రోజాకు అస్స‌లు ప‌డ‌దు. ఈ నేప‌థ్యంలో అనిత ఇక నుంచి రోజూ ఆమెపై విరుచుకుప‌డినా ఆశ్చ‌ర్యం లేదు. కేసులు.. కోర్టులు అనే మాట ఎలా ఉన్నా.. రోజాను వ్య‌క్తిగ‌తంగాను.. రాజ‌కీయంగా కూడా టార్గెట్ చేసేందుకు వెనుకాడే ప‌రిస్థితి లేదు. ఇక‌, ఇప్ప‌టికే.. తాము త‌ప్పులు చేయ‌లేద‌ని.. మంచి చేసి ఓడిపోయామ‌ని  చెప్పిన నేప‌థ్యంలో రోజాపై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఇవి మ‌రింత పెర‌గ‌నున్నాయి.

అదే స‌మ‌యంలో రోజా ప‌ర్యాట‌క‌, క్రీడా శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప‌లువురికి ఉద్యోగాలు ఇప్పించి.. లంచాలు తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వీటిపై ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే ఫిర్యాదులు అందాయి. అదే స‌మ‌యంలో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకువ చ్చిన వారిని కూడా బెదిరింపుల‌కు దిగిన‌ట్టు స‌మాచారం. దీనిపై స‌ర్కారు దృష్టి పెట్టింది. సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో ఆగ‌డాలు.. ఒక మ‌హిళా కౌన్సిల‌ర్ నుంచి రూ. 30 ల‌క్ష‌లు తీసుకున్న వ్య‌వ‌హారం.. అన్న‌ద‌మ్ములు చేసిన వ్య‌వ‌హారాలు ఇలా..అనేక రూపాల్లో రోజాకు స‌మ‌స్య‌లు రానున్నాయి. దీంతో ఆమె దూల తీరి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: